చిరు కూతురికే బిస్కెట్ వేసేసిందిగా?

Tue Jan 10 2017 13:48:12 GMT+0530 (IST)

అవకాశం వచ్చినప్పుడు చొచ్చుకుపోవాలి. మంచి ఛాన్స్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న వాళ్లకు అనుకోకుండా బంపర్ ఆఫర్ దక్కితే ఎవరుమాత్రం ఆ బంగారుఅవకాశాన్ని మిస్ చేసుకుంటారు? ఇప్పుడు అలాంటి పనిలోనే ఉంది రాయ్ లక్ష్మీ. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా.. స్పెషల్ సాంగ్స్ కు సెటిల్ కావటానికి మించిన బాధ మరింకేం ఉంటుంది.

అయినప్పటికీ.. అసలా విషయాన్నే పట్టించుకోనట్లుగా మాట్లాడే రాయ్.. చిరుతో స్పెషల్ సాంగ్ తో వచ్చి పడిన మైలేజీని మరిన్ని అవకాశాలు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. చిరుతో చేసిన స్పెషల్ సాంగ్ లో అమ్మడి అందం అదిరిపోయిందన్న టాక్ తో మురిసిపోతున్న రాయ్.. చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. తానంత అందంగా కనిపించటానికి కారణం తాను వేసుకున్న డ్రెస్ అంటూ తెగ గొప్పలు చెప్పేస్తుంది.

మీకు గుర్తున్నంత వరకూ ఏహీరోయిన్ కానీ.. ఇంకెవరైనా కానీ.. అందంగా కనిపించటానికి నేను కాదు నేను వేసుకున్న డ్రెస్సే అని చెప్పటం చూశారా? కానీ.. రాయ్ మాత్రం ఎవరు అడిగినా అదే విషయాన్ని చెప్పేస్తుంది. ఎందుకలా? అంటే.. అక్కడే అసలు పాయింట్ ఉంది.

చిరుతో చిందులేసిన స్పెషల్ సాంగ్ లో రాయ్ లక్ష్మీ వేసుకున్నక్యాస్టూమ్స్ ను డిజైన్ చేసింది మరెవరో కాదు.. చిరు పెద్ద కుమార్తె సుస్మిత. ఎవరి మనసు దోచుకుంటే ఒకటికి రెండు అవకాశాలు వస్తాయో తెలిసినప్పుడు రాయ్ లక్ష్మీ ఆ మాత్రం లౌక్యం ప్రదర్శించకుండా ఉంటారా? అందులోకి ఇదే డ్రెస్ దగ్గర గొడవ పడి ఛాన్స్ మిస్ చేసుకున్న క్యాథరిన్ ఎపిసోడ్ తెలిసిన రాయ్.. ఇప్పుడు డ్రెస్సుకు తెగ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తూ ఎవరికి బిస్కెట్ వేస్తుందో వివరించి చెప్పాల్సిన అవసరం లేదేమో..?