Begin typing your search above and press return to search.

జూలీ2.. ఆ సీన్స్ లీక్

By:  Tupaki Desk   |   23 Nov 2017 9:19 AM GMT
జూలీ2.. ఆ సీన్స్ లీక్
X
తెల్లారితే రాయ్ లక్ష్మి కెరీర్ లో 50వ చిత్రం రిలీజ్ అవుతోంది. జూలీ2 టైటిల్ పై తెరెకెక్కిన ఈ మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది ఈ సౌత్ భామ. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదికి పైగా కష్టపడింది రాయ్ లక్ష్మి.

అంతే కాదు.. ఈ సినిమా కోసం ఇప్పటివరూక ఎన్నడూ లేనంతగా అందాలను కూడా ఒలకబోసేసింది. ఇదంతా తనకు బాలీవుడ్ లో గ్రాండ్ లాంఛింగ్ ఇచ్చుకునేందుకే అని చెప్పాల్సిన పని లేదు. అయితే.. సరిగ్గా సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. రాయ్ లక్ష్మికి అనుకోని షాక్ ఎధురైంది. ప్రస్తుతం జూలీ2 ప్రమోషన్స్ కోసం ఈ భామ తెగ హడావిడిగా పలు ప్రాంతాల చుట్టూ చక్కర్లు కొడుతుండగా.. సోషల్ మీడియాలో జూలీ2కి సంబంధించిన కొన్ని సీన్స్ లీక్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం చేసిన కొన్ని ఇంటిమేట్ సీన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తున్నాయి. అక్కడి నుంచి వాట్సాప్ వంటి వాటిలోకి కూడా ఈ సీన్స్ చేరిపోయాయి.

ఈ విషయం కూడా తెలియనంత బిజీగా రాయ్ లక్ష్మి ప్రమోషన్ పనుల్లో మునిగిపోయింది. విషయం తెలియగానే షాక్ తిన్న రాయ్ లక్ష్మి.. 'ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాకు ఈ విషయం తెలియదు. సినిమా రిలీజ్ కు ముందు ఇలా చేయడం చాలా దారుణం' అంటూ వాపోయింది రాయ్ లక్ష్మి.