Begin typing your search above and press return to search.

'నాగ' లుక్స్ తో అదరగొట్టిన ముని

By:  Tupaki Desk   |   3 Aug 2015 4:20 PM GMT
నాగ లుక్స్ తో అదరగొట్టిన ముని
X
రాఘవ లారెన్స్ ... మనిషిలో విషయం వున్నా అతనిలో అతి కాస్త మితి మీరితేనే ప్రమాదం. తెలుగులో మాస్ తో హిట్ కొట్టి, స్టైల్ తో అభిమానులను సంపాదించుకున్న ఈ డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ కెరీర్ అంతా ఎత్తుపల్లాలుగానే సాగింది. మంచి ఫామ్ లో వున్న ప్రభాస్ తో రెండేళ్ళకు పైగా 'రెబల్' ని తెరకెక్కించి అదికాస్తా అట్టర్ ఫ్లాప్ గా మారినతరువాత మరే డైరెక్టర్ అన్నా కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. కానీ లారెన్స్ వెనువెంటనే తనకు అచ్చొచ్చిన ముని సిరీస్ తో మనముందుకు వచ్చి హిట్ ని అందుకున్నాడు.

ప్రస్తుతం న్యూస్ లో లేని లారెన్స్ సడెన్ గా తన తదుపరి సినిమా స్టిల్స్ దింపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'నాగ' అనే టైటిల్ తో ఈ సినిమా తెరక్కుతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా మునీ సిరీస్ కి కొనసాగింపా లేక కొత్త తరహా చిత్రమా అన్నది తెలియాల్సివుంది. విడుదల చేసిన స్టిల్స్ కాస్త సాంబార్ వాసన కొడుతున్నా కొత్తగా వున్న ఫీలింగ్ అయితే కలగకమానదు. మరి రాఘవ నయా నాగ పై మీరూ ఓ లుక్కేయండి .