Begin typing your search above and press return to search.

హాట్ ఇమేజ్ కోసం లావణ్య తంటాలు

By:  Tupaki Desk   |   26 July 2016 8:37 AM GMT
హాట్ ఇమేజ్ కోసం లావణ్య తంటాలు
X
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లకు కొరత కనిపిస్తోంది. పెద్ద హీరోయిన్స్ అంతా పెద్దోళ్లు అయిపోవడం.. పెద్ద స్టార్స్ పక్కన తీసుకునేందుకు ఆలోచించాల్సి రావడంతో.. ఆ గ్యాప్ ని ఫిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే కొంతమంది భామలు పసిగట్టేశారు. అందుకే స్టార్ హీరోయిన్ అయిపోయేందుకు తమ ప్రయత్నాలు ప్రారంభించేశారు. వారిలో లావణ్య త్రిపాఠి కూడా ఉందని చెప్పాల్సిందే.

రీసెంట్ గా విడుదలైన శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ లో.. అందరికంటే ఎట్రాక్టివ్ గా కనిపించింది లావణ్యే. పైగా ట్రైలర్ ప్రారంభలోనే క్లీవేజ్ షో మొదలుపెట్టేసింది. నిమిషంన్నర ఉండే శ్రీరస్తు శుభమస్తు ట్రైలర్ లో లావణ్య అందాల ఆరబోత బాగానే చేసేసింది. వీలైనప్పుడల్లా క్లీవేజ్ అందాలను ఆరబోసింది. ట్రైలర్ లోనే ఇన్ని అందాలుంటే.. ఇక సినిమా ఎంత రంజుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ హీరోయిన్ అనిపించుకుంటే చాలు అవకాశాలు వచ్చి పడతాయనడంలో సందేహం లేదు.

గీతా ఆర్ట్స్ పై రెండు బ్యానర్స్ ఉంటే.. రెండింటిలోనూ యాక్ట్ చేసేసిన ఏకైక హీరోయిన్ లావణ్య. నానితో భలేభలే మగాడివోయ్ తర్వాత.. ఇప్పుడు అల్లు శిరీష్ తో కలిసి శ్రీరస్తు.. శుభమస్తు చేసింది. దీంతో ఇప్పటికే ఈమెకు మెగా హీరోయిన్ అనే పేరు వచ్చేసింది. దీన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుని హాట్ హీరోయిన్ అయి.. ఆ తర్వాత స్టార్ గా ఎదిగేందుకు బాగానే ట్రై చేస్తోంది లావణ్య త్రిపాఠి.