Begin typing your search above and press return to search.

మెగా ప్రాఫిట్స్ తో లావణ్య ఎక్సయిటెడ్

By:  Tupaki Desk   |   24 Aug 2016 7:30 PM GMT
మెగా ప్రాఫిట్స్ తో లావణ్య ఎక్సయిటెడ్
X
ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా.. క్రిటిక్స్ రివ్యూలతో పనిలేకుండా.. ఆడియన్స్ ఇచ్చే కలక్షన్ల రివార్డుతో తూనిక చూసుకుని సంబరాలు చేసుకుంటోంది. ముఖ్యంగా రివ్యూలతో సంబంధం లేకుండా సన్నాఫ్‌ సత్యమూర్తి - సరైనోడు విషయంలో బన్నీ కొట్టిన హిట్టు రేంజ్ చూసి.. మెగా క్యాంపు అంతా ఇప్పుడు కలక్షన్ల లెక్కలే చెబుతున్నారు.

మొన్ననే రిలీజైన అల్లు శిరీష్‌ ''శ్రీరస్తు శుభమస్తు'' సినిమా అందరికీ బాగానే నచ్చింది. ముఖ్యంగా శిరీష్‌ బాగా ఇంప్రూవ్డ్ గా నటించడం.. అలాగే లావణ్య త్రిపాఠి గ్లామర్.. సినిమాకు తెగ నప్పేశాయి. అడియన్స్ కు బాగా నచ్చేశాయి. దానితో సినిమాకు కలక్షన్లు బాగానే ఉన్నాయి. దానికితోడు ఆ తరువాత రిలీజైన ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడకపోవడంతో.. ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తు సినిమా దాదాపు 9 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే అల్లు అరవింద్ కు ఒక 6.5 కోట్లు వరకు ప్రాఫిట్ వచ్చినట్లే.

ఇదంతా గమనిస్తున్న హీరోయిన్ లావణ్య.. చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను అంటోంది. ఈ మధ్య కాలంలో ఇదే విధంగా చాలా సినిమాలతో ఈ సుందరాంగి మాంచి లాభాలు వచ్చినందుకు ఎంజాయ్ చేస్తోంది. గుడ్ గోయింగ్ లేడీ.