మలేషియాలో అందాల రాక్షసి

Fri Oct 13 2017 14:05:32 GMT+0530 (IST)

టాలీవుడ్ అందాల రాక్షసి గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి ఫ్యాన్స్ ని బాగానే సంపాదించుకున్నా సరైన హిట్స్ మాత్రం అందుకోవడం లేదు. వచ్చిన మొదట్లో రెండు మూడు హిట్స్ అందుకొని బాగానే పాపులర్ అయ్యింది. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో భారీ హిట్ అందుకొని అందరిని ఆకర్షించింది. అందంలోను అమ్మడు చాలా కొత్తగా కనిపించింది.దీంతో వరుసగా ఛాన్సులను దక్కించుకుంది. కానీ ఏ సినిమా సరైన హిట్ అవ్వలేదు. చివరగా నాగ చైతన్య తో యుద్ధం శరణం సినిమాలో నటించింది. ఆ సినిమా అయితే దారుణమైన డిజాస్టర్ ని ఇవ్వడంతో లావణ్య చాలా నిరాశ చెందింది. అంతే కాకుండా రెండు ప్రాజెక్టులను సడన్ గా తప్పుకొని విమర్శలు తెచ్చుకుందని ఒక టాక్ వచ్చింది. అయితే సొట్ట బుగ్గల సుందరి ఆ విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఫ్యామిలీ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. మలేషియా టూర్ లో చాలా హ్యాపీగా గడుపుతోంది.  ఎప్పటికప్పుడు టూర్ లో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.

సాదారణంగా రెండు మూడు సినిమాలు డిజాస్టర్ అయితే హీరోయిన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా టెన్షన్స్ తో ఉంటారు. కానీ లావణ్య అలాంటి టెన్షన్ పెట్టుకోకుండా కాస్త రిలాక్స్ అవుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమలు ఉన్నాయి. అలాగే తమిళ్ సినిమాలో కూడా నటిస్తోంది.