Begin typing your search above and press return to search.

ఈమెకు 'మెగా' బ్రేక్ వస్తుందా?

By:  Tupaki Desk   |   10 Aug 2017 8:23 AM GMT
ఈమెకు మెగా బ్రేక్ వస్తుందా?
X
తెలుగు సినిమా స్టార్ హీరోయిన్ కావాలి అంటే ఖచ్చితంగా స్టార్ హీరోలతో నటించితే తప్ప అవ్వరు. చిన్న సినిమాలు చేసి స్టార్ అయినవారు ఉన్నారు కానీ ఒకసారి పెద్ద స్టార్ తో నటించిన తరువాత మళ్ళీ చిన్న హీరోతో నటించే పరిస్థితులు తక్కువనే చెప్పాలి. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లు ఎవరు కాబోతున్నారు అనే విషయంలో మాత్రం అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది హీరోలు ఉన్న మెగా క్యాంపులో పాగా వేస్తే బెటర్ అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. చరణ్‌ అండ్ బన్నీ వంటి స్టార్లతో చేస్తే ఇక పెద్ద హీరోయిన్ అయిపోయినట్లే అని చాలామంది ప్రూవ్ చేశారు కూడా.

ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే చిన్న హీరోల హీరోయిన్ గా నటించి ఆ తరువాత రామ్ చరణ్ తో అల్లు అర్జున్ తో నటించి స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి వచ్చేసింది. రెజీనా తన కెరియర్ మొదటిలో మెగా హీరోలు అయిన సాయి ధరమ్ తేజ్ తో మరియు అల్లు శిరీష్ తో సినిమాలు చేసింది కానీ మిగతా మెగా క్యాంపస్ స్టార్ హీరోలు రామ్ చరణ్ - అల్లు అర్జున్ సినిమాలు చేసే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు అదే దారిలో వస్తున్న లావణ్య త్రిపాఠి కూడా ఆ అవకాశం వస్తుందా లేక రెజీనా లాగా అవకాశం కోసం ఎదురుచూస్తు ఉండిపోతుందో చూడాలి. లావణ్య త్రిపాఠి ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా నటిస్తున్న వినాయక్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. దీని కన్నా ముందు అల్లు శిరీష్ తో ఒక సినిమాలో నటించింది. అంతే కాకుండా మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా మిష్టర్ లో నటించింది. ఇప్పుడు ఈ అనుభవాన్ని అర్హతను వాడుకొని మెగా హీరోలలో టాప్ హిరోలైన రామ్ చరణ్ - అల్లు అర్జున్ సినిమాలలో ఛాన్స్ కోసం చూస్తోందట.

ఇకపోతే పెద్ద సినిమాలేమో కాని.. లావణ్య చేతిలో మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. నాగ చైతన్య హీరోగా వస్తున్న యుద్దం శరణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే రామ్ హీరోగా నటిస్తున్న ఉన్నది ఒకటే జిందగీ లో కూడా ఈమె ఒక హీరోయిన్.