అందాల రాక్షసి.. ఐదు రూపాయల చోరీ

Wed May 16 2018 12:50:51 GMT+0530 (IST)

దొంగతనాల గురించి చెప్పుకుంటే టాపిక్ సీరియస్ కావచ్చేమో కానీ.. చిలిపి చోరీల కథలు మాత్రం బాగుంటాయి. అదే.. సెలబ్రిటీ కహానీలు వినేందుకు ఇంకా ఆకట్టుకుంటాయి. అందాల రాక్షసిగా టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇప్పుడు తన గతం గురించి ఓ చిలిపి కహానీ ఇలాగే వినిపిస్తోంది.ఈ భామ ఓ సారి ఐదు రూపాయలు కొట్టేసిందట. ఇప్పుడు కాదు లెండి.. ఇప్పుడంటే లక్షలు కోట్లు వస్తున్నాయి కాబట్టి ఐదు రూపాయలు పెద్ద మ్యాటర్ అనిపించకపోవచ్చు కానీ.. స్కూల్ డేస్ లో ఫైవ్ రూపీస్ అంటే కచ్చితంగా గట్టి మొత్తమే. స్కూలుకు వెళ్లే సమయంలో ఓ సారి ఇలాగే ఐదు రూపాయలు కొట్టేసిందట లావణ్య. ఇలా కొట్టేసిన మొత్తంతో చాకొలేట్ కొనుక్కున్నానని చెబుతోంది. ఈ పని చేసినందుకు వాళ్ల అమ్మ దగ్గరి నుంచి బాగానే తిట్లు పడ్డాయని చెప్పింది లావణ్య. ఆ తర్వాత అమ్మ దగ్గర చాలానే మంచి నేర్చుకుందట.

తాను ఎప్పుడూ సాయంత్రం 7 తర్వాత బయట తిరగలేదని.. అమ్మ తనను అంత స్ట్రిక్ట్ గా పెంచిందని చెప్పిందని చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఓ సారి తన స్కూల్ బ్యాగ్ లో మొబైల్ ఫోన్ దొరికినప్పుడు కూడా బాగానే తిట్లు తినాల్సి వచ్చిందట.

అయితే ప్రస్తుతం తాను ఇంత డిసిప్లిన్డ్ గా ఉన్నానంటే అందుకు కారణం తన అమ్మే అని చెప్పిన లావణ్య త్రిపాఠి.. అమ్మ తనను ఎంతో క్రమశిక్షణతో పెంచిందని చెప్పింది. తన ఎదుగుదలలో ప్రతీ అడుగు అమ్మ కారణంగానే అని చెప్పింది ఈ భామ.