Begin typing your search above and press return to search.

దేవిశ్రీ కోసం ఫోజులిచ్చిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   27 May 2016 1:31 PM GMT
దేవిశ్రీ కోసం ఫోజులిచ్చిన హీరోయిన్‌
X
దేవిశ్రీ ప్రసాద్ అంటే ఎంత ఎనర్జీనో.. అందరికీ తెలుసు. ప్రొఫెషన్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్ అయినా.. స్టేజ్ ఎక్కాడంటే మనోడు సింగింగ్ తో పాటు పెర్ఫామెన్స్ ఇరగదీసేస్తాడు. కంపోజర్, సింగర్, డ్యాన్సర్ గానే కాదు.. ఈ రాక్ స్టార్ లో ఫోటోగ్రాఫి అనే కళ కూడా ఉంది. ఈ విషయాన్ని హీరోయిన్ త్రిపాఠి ప్రాక్టికల్‌ గా చూపిస్తోంది.

'దేవిశ్రీప్రసాద్ కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నన్ను చాలా కాలంగా ఓ ఫోటో షూట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాడు. ఒక రోజు చెన్నైలో ఉన్న డీఎస్పీ స్టూడియోకి వెళ్లినపుడు.. నన్ను కొన్ని ఫోటోలు తీశాడు. నేను కూడా హ్యాపీగా బోలెడన్ని పోజులు ఇచ్చాను. తను ఓ అద్భుతమైన ఫోటోగ్రాఫర్. తను తీసిన ఫోటోలను చూస్తే మెస్మరైజ్ అవడం ఖాయం. వాటి గురించి నేను చెప్పనవసర్లేదు అవే మాట్లాడతాయ్ కూడా' అంటోంది లావణ్య త్రిపాఠి. రాక్ స్టార్ తీసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి. ఈ ఫోటోలను చూస్తే.. ఈ అందాల రాక్షసి చెప్పిన మాటలు అక్షర సత్యాలని అర్ధమవుతోంది.

దేవిశ్రీలో ఉన్న ఎవరికీ తెలియని ఈ ట్యాలెంట్ ను మొత్తానికి లావణ్య బయటపెట్టేసింది. మరి ఈ ట్యాలెంట్ ని ఉపయోగించుకునేదెవరో తెలియాలి. ఇదిలా ఉంటే అల్లు శిరీష్ కి జోడీగా లావణ్య త్రిపాఠి నటించిన శ్రీరస్తు శుభమస్తు విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు శర్వానంద్ తో ఓ సినమా, శ్రీనువైట్ల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ తో ఓ మూవీ చేస్తోంది లావణ్య త్రిఫాఠి.