Begin typing your search above and press return to search.

ఇది జస్ట్ రఫ్‌.. అసలు ముందుంది

By:  Tupaki Desk   |   21 Aug 2017 5:14 PM GMT
ఇది జస్ట్ రఫ్‌.. అసలు ముందుంది
X
ఇప్పుడు సుందరాంగులు సినిమాల్లోకంటే తమ సోకులను సోషల్ మీడియాల్లో ఎక్కువగా చూపించేస్తున్నారు. ముందు ఇక్కడ రెచ్చగొట్టేసి తరువాత వెండితెర మీద సత్తా చాటేద్దాం అని ప్రయత్నిస్తున్నారు. అందుకే తెలుగు భామలైనా ఉత్తారాది నుండి ఇటొచ్చి సెటిలైన నెరజాణలైనా కూడా.. సోషల్ నెట్వర్కు లో మాత్రం సోకులు చిట్టాను ఓపెన్ చేస్తున్నారంతే.

అదిగో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని చూడండి.. ఇప్పుడు తన సినిమాలేవీ రిలీజ్ కు రెడీగా లేవు. రేపు నాగచైతన్య సరసన చేసిన యుద్దం శరణం ఒక్కటే ఆమె చేతిలో ఉంది. అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే అయ్యాయ్. కాని అవన్నీ పట్టించుకోకుండా.. తన సత్తా తాను చూపిస్తాను అన్నట్లు.. ''ఇది కేవలం రఫ్ వర్షన్.. ముందుంది ముసళ్ల పండగ'' అంటూ ఆ ఫోటోను షేర్ చేసింది. ఏదో కెమెరా బ్లర్ చేసిందనే కాని.. కనిపించాల్సిన అందాలన్నీ బాగానే కనిపిస్తున్నాయి. గుచ్చుకోవాల్సిన చూపులన్నీ అక్కడే గట్టిగా గుచ్చేస్తున్నాయి.

అయితే ఇలా అందాల ఆరబోతనే నమ్ముకుంటే మాత్రం తాప్సీ తరహాలో ఫేడవుట్ అయిపోవడం ఖాయం. కాస్త అభినయం.. కాస్త కలిసొచ్చే స్ర్కిప్టులను కూడా ఎన్నుకుంటే.. ఖచ్చితంగా బ్రేక్ వచ్చే ఛాన్సుంది. చూద్దాం అమ్మడు ఏం చేస్తుందో!!