Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో కొత్త విదేశీ మోడల్‌

By:  Tupaki Desk   |   31 July 2015 7:36 AM GMT
టాలీవుడ్‌లో కొత్త విదేశీ మోడల్‌
X
మరియం జకారియా (ఆర్య2), గాబ్రియెలా బెర్ట్రాంటె (గంగతో రాంబాబు), స్కార్లెట్‌ విల్సన్‌ (ఎవడు), మోడల్‌ నికోల్‌ ఎమి (బాద్‌షా), నోరా ఫతేహి (బాహుబలి), పింకీ సావిక (ఏమో గుర్రం ఎగురావచ్చు) .. ఇంతమంది విదేశీ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ లో అదృష్టం పరీక్షించుకున్నారు. ఐటెమ్‌ భామలుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

లేటెస్టుగా ఈ భామల్లానే మరో విదేశీ ముద్దుగుమ్మ తెలుగు సినీపరిశ్రమలో అడుగుపెడుతోంది. లారిస్సా బోనెస్సి అనేది ఈ భామ పేరు. సైఫ్‌ అలీఖాన్‌ సరసన గో గోవా గాన్‌ చిత్రంలో కథానాయికగా నటించింది. మహీంద్రా స్కూటర్‌ టీవీ యాడ్‌, క్లినిక్‌ ప్లస్‌ షాంపూ యాడ్‌, జియోనీ మొబైల్స్‌ టీవీ యాడ్‌ .. వీటన్నిటిలో ఈవిడే మోడల్‌.

ఇప్పుడు తెలుగు దర్శకనిర్మాతల కన్ను ఈ విదేశీ ముద్దుగుమ్మ పై పడింది. సునీల్‌ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరో గా తెరకెక్కనున్న 'తిక్క' సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతోంది. లారిస్సా పూర్తి స్థాయి కథానాయికగా తెలుగు తెరకి పరిచయం అవుతోంది. లండన్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ తరహాలోనే లారిస్సా పెద్ద స్టార్‌ అయ్యి సౌత్‌ ని ఏల్తుందేమో చూడాలి.