Begin typing your search above and press return to search.

ఇంకో ఎన్నారై డిస్ట్రిబ్యూటర్..

By:  Tupaki Desk   |   12 Feb 2016 5:30 PM GMT
ఇంకో ఎన్నారై డిస్ట్రిబ్యూటర్..
X
టాలీవుడ్ సినిమాలంటే గతంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వసూళ్లు రాబట్టేవి. ఇప్పుడు బౌండరీలు చెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు కుమ్మేస్తున్నపరిస్థితి. మొత్తం కలెక్షన్లలో 25శాతం వరకూ తెలుగు రాష్ట్రాలకు బయటకే వస్తున్నాయంటే.. ఏ రేంజ్ లో ప్రపంచం అంతా మన సినిమాలు వెళ్తున్నాయో అర్ధమవుతుంది.

ఇంతకుముందు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలుగా మారేవాళ్లు. ఇప్పుడు ఎన్నారై డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తున్నారు. గతంలో మహేష్ బాబుతో దూకుడు, ఆగడు వంటి సినిమాలు చేసిన 14 రీల్స్ బ్యానర్ ఇలాంటిదే. ఆ తర్వాత సూపర్ స్టార్ తోనే శ్రీమంతుడు సినిమా తీసిన మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఇదే టైపు. ఇప్పుడు మరో సంస్థ కూడా నిర్మాణం లోకి దిగుతోంది. లార్గన్ ఎంటర్ టెయిన్ మెంట్స్ అనే బ్యానర్ పై సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు రామ అక్కల. ఈయన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ లలో తెలుగు మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. గత పదేళ్లుగా పంపిణీదారుడిగా అనుభవం ఉంది.

ఆ దేశాల్లో రిలీజ్ అయిన మన భారీ చిత్రాలన్నీ రామ పంపిణీ చేసినవే. నిర్మాణ రంగంపై ఉన్న మక్కువతో.. తెలుగులో సినిమా తీయాలని నిర్ణయించిన రామ అక్కల.. ఇఫ్పుడో మూవీ స్టార్ట్ చేశారు. నాగశైర్య హీరోగా.. సాయి చైతన్య దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కానుంది. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించారు నిర్మాత.