ప్రొడ్యూసర్లపై ఓపెన్ అయిపోయిందిగా

Thu May 18 2017 00:32:21 GMT+0530 (IST)

సౌత్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కు అందాల ఆరబోత విషయంలో ఎలాంటి అభ్యంతరాలు కనిపించవు. కేరక్టర్ కి తగినట్లుగా చేశాననే కబుర్లు కూడా చెప్పదు ఈ భామ. జనాలు కోరుకున్నంత.. తను చూపగలిగినంత అందాలను ఆన్ స్క్రీన్ పై పరిచేసే లక్ష్మీ రాయ్.. ఇప్పుడు హీరోయిన్లతో నిర్మాతల ప్రవర్తనపై ఓపెన్ గానే మాట్లాడేసింది.

హీరోయిన్లతో ఫిలిం మేకర్స్.. ముఖ్యంగా నిర్మాతలు పైకి చెప్పకూడని సంబంధాలను నడుపుతూ ఉంటారనే టాక్ వినిపిస్తూనే ఉంటుంది. దీనిపై కొందరు పైపైన మాట్లాడితే.. చాలామంది లీకులు వదులుతుంటారు. కానీ లక్ష్మీ రాయ్ మాత్రం.. 'ఫిలిం ఇండస్ట్రీలోని కొందరు నిర్మాతలు నటీమణులతో పడుకునేందుకు ఉత్సాహం చూపుతుంటారు' అని ఓపెన్ గానే చెప్పేసింది. 'హీరోయిన్ల వ్యక్తిగత అవసరాలపై కూడా వీళ్లు బాగా దృష్టి పెడుతుంటారు. ఇదంతా వారితో గడిపేందుకే' అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లక్ష్మీ రాయ్.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం బాగానే నడుస్తోందని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీ గురించి.. అక్కడ జరిగే భాగోతాల గురించి అంతా బాగానే చెప్పింది కానీ.. తనకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని చెప్పడమే పెద్ద కామెడీ అయిపోయింది. ఏ మాత్రం ఇబ్బందులు ఎదుర్కోకుండానే ఇన్నేసి సంగతులు ఎలా తెలిసిపోయాయో అంటూ ఆన్ లైన్ లో ఈమెను రఫ్పాడేస్తున్నారు నెట్ జనాలు.