Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ వీరగ్రంథం ట్రైలర్.. ఏంటిది కేతిరెడ్డి గారూ?

By:  Tupaki Desk   |   13 March 2019 1:53 PM GMT
లక్ష్మీస్ వీరగ్రంథం ట్రైలర్.. ఏంటిది కేతిరెడ్డి గారూ?
X
మన టాలీవుడ్లో ఈమధ్య బయోపిక్ అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. సరే ఏదో కొత్త జోనర్ ఊపందుకుంది అనుకునేలోపు భయోపిక్ లతో వస్తున్నారు.. బెదరగొడుతున్నారు. ఇప్పటికే లెజండరీ ఎన్టీఆర్ పై రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండూ సినిమాలను 'బాలయ్య ఎన్టీఆర్' అనుకోవాల్సిందే. ఇక రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ రెండవ భార్య అయిన లక్ష్మీపార్వతి వెర్షన్ లో 'నిజాలను చూపిస్తాను' అంటూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రోమోస్ తో సంచలనం సృష్టిస్తోంది. ఇక సినిమా ఎలా ఉందనేది రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేం. బాలయ్య వెర్షన్.. ఆర్జీవీ వెర్షన్ కాకుండా కేతిరెడ్డి వెర్షన్ కూడా ఉంది. ఆ సినిమానే 'లక్ష్మీస్ వీరగ్రంథం'. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే ఈ చెన్నై బేస్డ్ ఫిలింమేకర్ లక్ష్మీ పార్వతి 'అసలు స్వరూపాన్ని చూపిస్తాను' అంటున్నాడు.

కేతిరెడ్డిగారు తెరకెక్కిస్తున్న ఈ 'లక్ష్మీస్ వీరగ్రంథం' ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే దాదాపు 2 నిముషాల 41 సెకన్లు ఉంది. కానీ ట్రైలర్ లో ఒకే షాట్ ఉంది. ఆ షాట్ ప్రారంభం కావడానికి ముందే "తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం" అంటూ ఒక స్లైడ్ వేశారు. ఇక ఫస్ట్ షాట్ లో ఎన్టీఆర్ గారు హాల్లో కూర్చొని ఉంటారు. ద్వారబంధానికి రెండువైపులా రెండు పొడవాటి దీపపు సిమ్మెలు ఉంటాయి.. అందులో వత్తులు వెలుగుతూ ఉంటాయి. ఇక ఆరెంజ్ చీర కట్టుకుని ఉన్న లక్ష్మీ పార్వతి పాత్ర ఎడమ కాలు లోపలి పెట్టి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జస్ట్ ఎంట్రీ ఇవ్వదు. ఎడమ పాదాన్ని గడపపై పెడుతుంది. ఈ షాట్ ను ఫ్రీజ్ చేసి.. పాదం కింద కరెంట్ ఇంట్లోకి పాస్ అవుతున్నట్టుగా.. దీపాలు ఆరిపోయినట్టుగా.. ఒక రాబందు లోపలి వచ్చిన అరుస్తున్నట్టుగా.. ద్వారబందానికి అంటూ ఇటూ ఉన్న గోడకు పగుళ్ళు వచ్చినట్టుగా చూపించారు. ఆ షాట్ ను సడెన్ గా చూస్తే ఏదో హరర్ సినిమానేమో అనే అనుమానం కూడా వస్తుంది. దీని తర్వాత ఆమె నడుచుకుంటూ ఎన్టీఆర్ వద్దకు వెళ్తుంది. ఈ ఆస్కార్ లెవెల్ షాట్ పూర్తి కాగానే డైరెక్టర్ గారు తనను స్టైల్ గా చూపించుకున్నారు.

అది అయిపోగానే ద్రోహం విద్రోహం అంటూ ఒక పాట సాగుతూ ఉంటే.. విజువల్స్ లో బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ లు ఉన్న పెయింటింగ్ లు చూపించారు. అసలు దీన్ని ట్రైలర్ అనాలా.. లేదా అనేది మీరే చూసి డిసైడ్ చెయ్యండి. ఈ సినిమా టైటిల్ లోగోలో మరో ప్రత్యేకత ఉంది. 'వీరగ్రంథం' అని ఉండాలి.. కానీ టైటిల్ లోగోలో లాస్ట్ 'థ' అక్షరానికి పొట్టలో చుక్క ఉంది కాని కింద ఒత్తు లేదు. దాన్ని ఎలా టైప్ ఎలా చెయ్యాలో అర్థం కాక.. మా శక్తి సరిపోక తప్పు రాయాల్సి వచ్చింది. క్షమించండి. ఈ భాష గోస ఇలా ఉంటే నెటిజనుల వేదన మరోరకంగా ఉంది. ట్రైలర్ కింద జనాలు ఫ్రస్ట్రేషన్ తో తమ బూతు పదాల కౌశాలాన్ని..ప్రావీణ్యాన్ని చూపించారు. ఆలస్యం ఎందుకు చూసేయండి కేతిరెడ్డి వెర్షన్.