Begin typing your search above and press return to search.

జూ. ఎన్టీఆర్ నా ఫోటో చించి అవతల పడేశాడు!

By:  Tupaki Desk   |   14 Dec 2018 9:51 AM GMT
జూ. ఎన్టీఆర్ నా ఫోటో చించి అవతల పడేశాడు!
X




సీనియర్ ఎన్టీఅర్ సతీమణి లక్ష్మి పార్వతి తరచుగా వార్తల్లో కనిపిస్తుంటారు. చంద్రబాబు పేరెత్తితేనే విరుచుకుపడే వ్యక్తులలో లక్ష్మీ పార్వతిని మొదటగా చెప్పుకోవాలి. తెలుగువారందరికీ ఆ కారణాలు తెలిసినవే కాబట్టి మళ్ళీ వాటి గురించి చర్చించుకోనవసరం లేదు. ఈ సోషల్ మీడియా జెనరేషన్ పిల్లలకు ఆమె గురించి పెద్దగా తెలియకపోయినా రామ్ గోపాల్ వర్మ కొద్ది నెలల క్రితం 'లక్ష్మీస్ ఎన్టీఅర్' చిత్రం ప్రకటించడంతో ఆమె మళ్ళీ వార్తల్లోకొచ్చారు.

తాజాగా లక్ష్మి పార్వతి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో ఆమె వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టించేలా ఉన్నాయి. బాబు నుండి లోకేష్ వరకూ దాదాపు అన్ని టాపిక్కులు మాట్లాడిన ఆమె జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు. యాంకర్ ఆమెను "జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారి సీనియర్ ఎన్టీఅర్ గారు పిలిపించి మాట్లాడారని అన్నారు. ఆ సమయంలో మీరు కూడా ఉన్నారని చెప్పారు" దాని గురించి చెప్తారా అని అడిగితే "అసలు వారిని పిలిపించింది నేనే. మా పెళ్ళయ్యాక ఆ అబ్బాయి ని వాళ్ళ అమ్మను పిలిపించింది నేనే. వాడు నా ఫోటో చించి అవతల పడేశాడు".. (ఎమోషనల్ అవుతూ ఇలా కంటిన్యూ చేశారు) "వాడూ ఏం తక్కువ కాదు కదా.. మినహాయింపేమీ కాదు." అన్నారు. మరో సందర్భంలో "ప్రతి రోజు ఉదయాన్నే షాలిని(ఎన్టీఆర్ అమ్మగారు) ఫోన్ చేసేది. అత్తయ్య గారూ అది కావాలండీ.. అత్తయ్యగారు ఇది కావాలండి అంటూ రోజూ ఫోనులే" అంటూ అప్పటి విషయాలని పంచుకుంది.

లోకేష్ గురించి అడిగితే "అయన తెలుగు భాష మాట్లాడతాడా లేదా అనేది తెలియడం లేదు. 10 లక్షలు ఖర్చుబెట్టి ట్యూషన్ మాస్టర్ ని పెట్టి తెలుగు నేర్పిస్తే కూడా ఇంకా తెలుగురాలేదు. అలా అని ఇంగ్లీష్ వచ్చా అంటే.. అది కూడా రాదు. ఏ భాషా రాని అయోమయంలో పెరిగిన ఓ వ్యక్తిని బలవంతంగా ప్రజల మీద రుద్దితే మంత్రి అవుతాడా?" అని ప్రశ్నించింది. ఇక ప్రతిపక్ష నాయకుడు.. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆడితే తనకు ఆయన కొడుకుతో సమానం అని.. అయన గెలవాలని కోరుకుంటానని చెప్పింది. తనపై విష ప్రచారం చేసేవారిని అసలు పట్టించుకోనని.. ఎప్పటినుండో వారిపై పోరాడుతున్నానని.. ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది ఎన్టీఆర్ అని చెప్పింది. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడిన ఈ సెన్సేషనల్ ప్రోమో పై మీరు కూడా ఒక్కసారి లుక్కేయండి.



వీడియో కోసం క్లిక్ చేయండి