ఫోటో స్టొరీ: ఆ స్టైల్ ఫసాక్.. అంతే

Fri May 24 2019 13:26:17 GMT+0530 (IST)

మోహన్ బాబు ముద్దుల కుమార్తెగా మంచు ల క్ష్మి  ఎప్పుడూ తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. ఒక నటిగా.. టీవీ హోస్టుగా.. నిర్మాతగా..  మంచు లక్ష్మి తన సత్తా చాటారు. టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువ మంది మల్టిటాలెంటెడ్ మహిళలలో మంచు లక్ష్మి ఒకరు. అమెరికన్ సీరియల్స్ లో కూడా నటించి మంచువారికి సాటిలేదు.. పోటీ అంతకన్నా లేదు అనిపించారు.మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.  తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేస్తూ "పొద్దు తిరుగుడు పువ్వు అవ్వండి.. మీ వెలుగును గుర్తించండి." అంటూ ఒక ఫసాక్ మెసేజ్ ఇచ్చారు. చదవడానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ ఈ మెసేజ్ ఎంతో అర్థవంతమైనది.  ప్రతి ఒక్కరిలో వెలుగు ఉంటుంది.. ఆ వెలుగు వైపు ప్రయాణం చేస్తున్నంత కాలం మనసుకు హాయిగా ఉంటుంది.  ఆ వెలుగు ఒక వైపు ఉండి మనం మరో వైపు ప్రయాణిస్తుంటే మాత్రం మనసుకు హాయిగా ఉండదు!  పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు ఎటు ఉంటే ఆటే తిరుగుతుంది కదా.  అలా మనం మన వెలుగును గుర్తించాలన్నమాట.  

మెసేజ్ అర్థం అయితే సరే. లేకపోయినా ఫర్వాలేదు.  ఎలెక్షన్ రిజల్ట్స్ ఎందుకలా వచ్చాయో అందరికీ అర్థం అయిందా.. అర్థం కాని వాళ్ళు సర్దుకొని పోతున్నారు కదా. అలా సర్దుకొని పోదాం.  ఇక ఫోటో విషయానికి వస్తే ఒక డెనిమ్ షర్టు వేసుకొని అల్ట్రా స్టైలిష్ గా పోజిచ్చింది. ఆ హెయిర్ స్టైల్.. ఆ యాటిట్యూడ్.. అదరహో.  ఈ ఫోటో చాలామంది నెటిజనులకు నచ్చింది.  ఒకరు "అక్కా సూపర్ పిక్" అన్నారు. మరొకరు "స్టైలిష్ లేడీ" అన్నారు.