Begin typing your search above and press return to search.

ఖైదీ.. బాహుబలి.. శాతకర్ణి.. ఒక చోటే

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:30 PM GMT
ఖైదీ.. బాహుబలి.. శాతకర్ణి.. ఒక చోటే
X
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధికంగా క్రేజ్ ఉన్న ప్రాజెక్టుల్లో ఓ మూడింటి గురించి స్పెషల్ గా చెప్పేసుకోవాలి. సెట్స్ మీద ఉన్న సినిమాలన్నీ క్రేజీ ప్రాజెక్టులే అనిపిస్తాయ్ కానీ.. రిలీజ్ కి ముందే బజ్ క్రియేట్ చేసి.. రోజురోజుకు అంచనాలు పెంచే సినిమాలు కొన్నే ఉంటాయి. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ఖైదీ నెంబర్ 150.. బాలయ్య వందో సినిమాగా రూపొందుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి.. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి ది కంక్లూజన్. స్టోరీ పరంగా వీటికి పోలిక పెట్టే ఛాన్స్ లేదు కానీ.. ఓ విషయంలో మాత్రం మూడు సినిమాలు ఒకచోటకే చేరాయి.

మెగా మూవీ ఖైదీ నెంబర్ 150.. బాలయ్య సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి.. ప్రభాస్ బాహుబలి2 చిత్రాల ఆడియో హక్కులన్నీ ఒకే కంపెనీ దక్కించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మూడు చిత్రాల రైట్స్ ను లహరి మ్యూజిక్ దక్కించుకోవడం హాట్ టాపిక్ అయింది. హిస్టరీలో నిలిచిపోయే మూడు భారీ క్రేజీ సినిమాల హక్కులను ఒకే కంపెనీ దక్కించేసుకోవడం విశేషం.

ఖైదీ నెంబర్ 150కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. గౌతమిపుత్ర శాతకర్ణికి మెమరబుల్ మ్యూజిక్ ఇవ్వాలని చిరంతన్ భట్ కష్టపడుతున్నాడు. ఇక బాహుబలి ది కంక్లూజన్ కు ది వన్ అండ్ ఓన్లీ ఎంఎం కీరవాణి ఇచ్చే సంగీతం వెన్నెముక అనడంలో సందేహాలు లేవులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/