Begin typing your search above and press return to search.

డాన్సుల విషయంలో చిరు స్టామినా అది మరి!

By:  Tupaki Desk   |   22 Oct 2016 3:30 PM GMT
డాన్సుల విషయంలో చిరు స్టామినా అది మరి!
X
మెగా అభిమానులు - సినిమా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో "ఖైదీ నెం.150" ఒకటి. ఈ సినిమా ప్రకటన జరిగిన నాటి నుంచీ ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు - ఆశలు అన్నీ ఇన్నీ కాదు. ఎందుకంటే... అది చిరంజీవి సినిమా. సినిమా జయాపజయాలతో సంబందం లేకుండా తానుచేసే డాన్సులు - ఫైట్లతోనే థియేటర్లకు రిపీటెడ్ ఆడియన్స్ ని రప్పించగలిగే సత్తా చిరుసొంతం. ఈ క్రమంలో సంక్రాంతికి తెలుగు ప్రజలను తనదైన శైలిలో పలకరించడానికి, ఆనందింపచేయడానికి చిరంజీవి 150వ సినిమా రెడీ అవుతోంది.

తాజాగా హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ లో ఈ సినిమాకు సంబందించిన పాటల చిత్రీకరణ జరుగుతోంది. "ఖైదీ నెం. 150" కి సంబందించి చిరంజీవి - లక్ష్మి రాయ్‌ లపై ఈ స్పెషల్ సాంగ్‌ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ పూర్తి కావటంతో దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం... "బాస్ ఈజ్ బ్యాక్" అనే మాస్ సాంగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించారు. ఈ పాటకి లారెన్స్ కొరియోగ్రాఫర్ గా చేశారు. అయితే సాంగ్ చిత్రీకరణ సమయంలో చిరంజీవి డాన్స్ ని చూసి ఇంప్రెస్ అయిన ఓ ఫిమేల్ డాన్సర్ హఠాత్తుగా వచ్చి చిరుని హత్తుకుందట!

దీంతో అక్కడున్న వారిలో కొంతమంది షాక్ అవ్వగా, మరికొంతమంది చిరు ఎలా స్పందిస్తారో అని తెగ భయపడిపోయారట. అయితే ఈ విషయాలపై స్పందించిన ఆడాన్సర్... చిరంజీవి ఈ వయస్సులో ఇలా డ్యాన్స్ చేస్తుంటే - యంగ్ స్టార్స్ డ్యాన్స్ చేస్తున్నట్టుగానే ఉందని, అందుకే తను చిరుని హగ్ చేసుకోవాలనిపించి ఆ విధంగా చేశానని చెప్పిందట! ఈ పరిణామానికి తొలుత షాక్ అయిన చిరు - అనంతరం ఆ డాన్సర్ పొగడ్తలకు ముగ్ధుడయ్యాడని అంటున్నారు. చిరంజీవా... మజాకా... డాన్సులు విషయంలో చిరుకి ఉన్న స్టామినా అది మరి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/