Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అందాల అనంతపూర్ దేవత

By:  Tupaki Desk   |   27 May 2019 8:07 AM GMT
ఫోటో స్టొరీ: అందాల అనంతపూర్ దేవత
X
ప్రియాంక జవాల్కర్ ఇప్పటివరకూ నటించింది రెండే సినిమాలు. ఒకటి 'కలవరం ఆయె' కాగా మరొకటి 'టాక్సీవాలా'. మొదటి సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ప్రేక్షకులకు పెద్ద తెలిసి ఉండదు. రెండో సినిమా విజయ్ దేవరకొండ సినిమా కావడం.. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ప్రియాంకకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఎందుకో ప్రియాంకకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

దీంతో ప్రియాంక గ్లామర్ గేర్ వేసింది. ఈమధ్య హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఘాటు ఫోటోలతో అందరినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ హాట్ మిషన్ లో భాగంగా తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది ప్రియాంక. ఆ ఫోటోకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు.. ఒక సీతాకోకచిలుక ఎమోజి మాత్రం పెట్టింది. క్రీమ్ కలర్ లో స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని అదే రంగులో ఉన్న పరదాల మధ్యలో ఒక సెన్సువల్ పోజిస్తూ నిలబడింది. గౌన్ కు ఫ్రిల్స్ ఉండడంతో ఎంతో అందంగా కనిపిస్తోంది. ముడివేసుకోకుండా.. జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టు హాట్ నెస్ ను మరింతగా పెంచింది. గౌన్ ను సెక్సీగా డిజైన్ చేయడంతో ప్రియాంక అందాల ఎగ్జిబిషన్ కూడా జరిగిపోయింది. అందాల అనంతపూర్ దేవతలాగా కనిపిస్తోంది!

అసలే 'టాక్సీవాలా' భామ.. ఆపై గ్లామర్ గేర్ వెయ్యడంతో నెటిజనులు థ్రిల్ అయ్యారు. ఒకరు "మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్" అంటూ సినిమా డైలాగ్ కొట్టారు. మరొకరు "ఓ మై హాటు లేడీ" అన్నారు ఇంకొకరు "వాట్ అమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా?" అన్నారు.