Begin typing your search above and press return to search.

ఆ హీరోయినా ఈ బూతులు తిడుతోంది!!

By:  Tupaki Desk   |   26 May 2016 6:35 PM GMT
ఆ హీరోయినా ఈ బూతులు తిడుతోంది!!
X
చాలా కాలం క్రితం ''స్నేహగీతం'' అనే ఓ సినిమా వచ్చింది. లగడపాటి శ్రీధర్‌ ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశాడు. ఓ మోస్తరుగా బాగానే ఉన్నసినిమా. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ గా చేసిన శ్రేయ ధన్వంతరీ.. పెద్ద యాక్టర్‌ కాదులే కాని.. అప్పట్లో అవకాశాల కోసం చాలానే ప్రయత్నించింది. చివరకు నాగ చైతన్య 'జోష్‌' సినిమాలో ఒక స్నేహితురాలి క్యారెక్టర్ లో నటించింది. ఆ తరువాత టాలీవుడ్ తో బాగా అప్సెట్‌ అయిపోయి.. అమ్మడు ముంబయ్‌ చెక్కేసింది. మోడలింగ్‌ అంటూ లింగరీల్లో ఆరబోసిన అమ్మడు.. ఆ ఫోటోలను ఇక్కడ రాకుండా చూసుకుందిలే. ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్‌ లో తన అదృష్టం వెతుక్కుంటూ.. బూతులు తిడుతోంది తెలుసా!!

అవును. ఇప్పుడు శ్రేయ ధన్వంతరి యాష్‌ రాజ్‌ ఫిలింస్‌ వారు తీస్తున్న ''లేడీస్‌ రూమ్'' అనే వెబ్‌ సిరీస్‌ లో నటిస్తోంది. ఈ సినిమాలో ఈమెతో పాటు సాబా ఆజాద్‌ అనే మోడల్.. డింగో.. కన్నా.. అనే పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక శ్రేయ పాత్రను తీసుకుంటే.. అమ్మడు నోరు విప్పితే చాలు.. ''ఫక్‌'' ''బె.....ద్‌'' ''చూ....'' అంటూ బూతులు తిట్టేస్తోంది. ఎలాగో వెబ్‌ లో వచ్చే వీడియోలకు సెన్సార్‌వంటివి ఏమీ ఉండవు కాబట్టి.. దాదాపు అన్నీ బూతులే తీస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ చూస్తే.. ''నా బూ.... ఇలా పెరిగిపోతున్నాయేంటే'' అంటూ అమ్మడు తన వక్షోజాలపై చేతులు వేసుకొని సరిచూసుకోవడం వంటి సీన్లను కూడా ఉన్నాయి. ఈ రేంజు బూతులతో బాలీవుడ్‌ వెబ్ లో ఎంట్రీ ఇస్తున్న ఈ భామ.. మరి అక్కడి సినిమాల్లో జెండా పాతేస్తుందా?