Begin typing your search above and press return to search.

అస్కార్ లో.. బై మిస్టేక్ జరిగిపోయింది

By:  Tupaki Desk   |   27 Feb 2017 7:29 AM GMT
అస్కార్ లో.. బై మిస్టేక్ జరిగిపోయింది
X
అస్కార్ పురస్కారాల కార్యక్రమం అంటే.. ఆ హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతిది చాలా క్రమపద్దతిలో సాగుతుందీ కార్యక్రమం. పొరపాట్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో నిర్వాహకులు డిజైన్ చేస్తుంటారు. అలాంటిది ఈసారి అస్కార్ అవార్డు పురస్కార కార్యక్రంలో భారీ తప్పే జరిగింది. బై మిస్టేక్ అని చెప్పి.. నిర్వాహకులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. అస్కార్ కార్యక్రమంలోనూ ఇలానా? అనే పరిస్థితి.

అస్కార్ అవార్డుల కార్యక్రమం భారత కాల మానం ప్రకారం సోమవారం ఉదయం నుంచి మొదలైంది. అంతా బాగానే జరిగి.. చివరి విజేతగా ఉత్తమ చిత్రాన్ని ప్రకటించాలి. ఇక్కడే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్తమ చిత్రం కేటగిరికి వచ్చిన చిత్రాల ప్రకటనను విడుదల చేసి.. వాటిల్లో అంతిమ విజేతగా నిలిచింది ఎవరంటే.. అంటూ.. ‘‘లా.. లా.. ల్యాండ్’’ను ప్రకటించారు. దీంతో.. ఆ చిత్ర బృందం ఆనందోత్సాహాల మధ్య వేదిక పైకి వచ్చేశారు.

అంతలోనే.. వ్యాఖ్యాత కలగజేసుకొని.. తాను తప్పుగా ప్రకటన చేసినట్లుగా పేర్కొంటూ.. అసలు విజేత ‘‘మూన్ లైట్’’గా పేర్కొన్నారు. దీంతో.. లా.. లా.. ల్యాండ్ చిత్రబృందానికి భారీ షాక్ తగిలినంతపనైంది. అదే సమయంలో మూన్ ల్యాండ్ చిత్ర బృందం ఒక్కసారి తీవ్ర భావోద్వేగంతో స్టేజ్ మీదకు వచ్చేశారు. ఇదంతా చూస్తున్నవారంతా.. బై మిస్టేక్ ఇలా జరగటం ఏమిటంటూ విస్మయానికిగురయ్యారు. ఉత్తమ చిత్రం విజేతను అనౌన్స్ చేసే సమయంలో చోటు చేసుకున్న గందరగోళం ఇప్పుడు అందరి నోటా చర్చగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/