Begin typing your search above and press return to search.

దేన్నీ వదలని తమిళ్ రాకర్స్

By:  Tupaki Desk   |   23 Feb 2019 1:20 PM GMT
దేన్నీ వదలని తమిళ్ రాకర్స్
X
కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీ శ్రీ. మన ఫిలిం మేకర్సేమో కాదేదీ బయోపిక్కుకనర్హం అంటున్నారు. తమిళ్ రాకర్స్ మాత్రం కాదేదీ పైరసీకనర్హం అనే స్లోగన్ పెట్టుకున్నారు. రజనీకాంత్ '2.0' నుంచి.. నిన్నే రిలీజ్ అయిన 'ఎల్ కే జీ' వరకూ ఒక్క సినిమాను వదిలిపెడితే ఒట్టు! ఈ 'ఎల్ కే జీ' కొత్తగా రిలీజ్ అయిన లో బడ్జెట్ తమిళ సినిమా.

ఆర్జే బాలాజీ తెలుసుకదా? స్టాండప్ కమెడియన్ అయిన ఇతను గతంలో మహేష్ బాబుపై అనుచితమైన కామెంట్లతో కామెడీ చేయడం.. ఆ తర్వాత మహేష్ ఫ్యాన్స్ బాలాజీకి చుక్కలు చూపించడం గుర్తుండే ఉంటుంది. సదరు బాలాజీ సోలో హీరో గా నటించిన సినిమానే ఈ 'ఎల్ కే జీ'. ప్రియా ఆనంద్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కేఆర్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎల్ కే జీ' తమిళ నాడు రాజకీయాలపై ఒక సెటైరికల్ ఫిలిం. ఈ సినిమాలో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనే గోల్ ఉన్న రాజకీయ నాయకుడిగా ఆర్జే బాలాజి నటించాడు. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకర్షించింది. పెద్ద పెద్ద హీరోలకు కూడా ప్రీమియర్స్ షోస్ ఉండవు కానీ ఈ సినిమాకు ప్రీమియర్స్ స్క్రీనింగ్ కూడా జరిగింది.

ఈ తతంగంతో మాకేమీ సంబంధం లేదు.. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా తేడా లేదు.. మాకు తెలిసింది పైరసీ చెయ్యడం.. నెట్టింట్లో పెట్టడం అన్నటుగా తమిళ రాకర్స్ వారు ఈ 'ఎల్ కే జీ' ని కూడా పైరసీ చేశారు. తమిళ ఫిలిం ఇండస్ట్రీ పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా అవి కొంతమేరకే ప్రభావం చూపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో పైరసీని అరికట్టలేకుండా ఉన్నాయి. ఈ పైరసీ సంగతేమో కానీ సినిమాకు మాత్రం డీసెంట్ రివ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం తమిళనాట ఉన్న రాజకీయ శూన్యతను వాడుకొని ప్రతి ఒక్కరూ సీఎం కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు కదా.. ఆ ఆరాటాన్ని ఫన్నీగా చూపించడమే కాకుండా అంతర్లీనంగా వోటర్లకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారని అంటున్నారు.