అతన్ని చుడాలని లేదు.. చూడను కూడా

Sat Jan 20 2018 16:59:01 GMT+0530 (IST)

తెరపై ఎంతో అందంగా నవ్వుతూ కనిపించే హీరోయిన్స్ వ్యక్తిగత విషయాల గురించి అనేక రూమర్స్ వస్తుంటాయి. ఈ రోజుల్లో అలాంటివి చాలా కామన్. అయితే తెలియని గాసిప్స్ కంటే హీరోయిన్స్ చెప్పే కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రీసెంట్ గా సీనియర్ నటి కుష్బూ వివరించిన కొన్ని విషయాలు కూడా అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బాలనటిగా తెరంగ్రేటం చేసిన కుష్బూ ఓ వయసుకు వచ్చే సరికి స్టార్ హీరోయిన్ అయ్యింది.
 
ఇక ఇప్పుడు స్పెషల్ పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తోంది. అయితే ఇటీవల  ఇండియాటుడే కాన్ క్లేవ్ లో మరచిపోలేని జ్ఞాపకానికి ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ..నాకు ఆ రోజు బాగా గుర్తుంది. 1986 సెప్టెంబరు 12వ రోజున మరచిపోలేని ఒక నిర్ణయాన్ని నేను తీసుకున్నా. నువ్వు పాక్కుంటూ బిక్షాటన చేసి డబ్బు తీసుకురా అని అన్నారు. దాంతో నేను వెంటనే కౌంటర్ ఇచ్చాను. అమ్మని తమ్మున్నీ అక్కడ నుండి తీసుకొని వచ్చేశా.అంతే కాకుండా అమ్మని సోదరుడిని చంపేసి నేను రైలు కింద పడి చస్తాను గాని మళ్లీ నీ దగ్గరకు రాను అని గట్టిగా చెప్పాను  అని కుష్బూ వివరించింది. తన తండ్రి ప్రవర్తన బావుండదని అందుకే అతనికి దూరంగా ఉన్నామని కుష్బూ వివరిస్తూ ఇప్పటికి కూడా తన తండ్రిని చూడటానికి ఇష్టపడలేదు. అలా అనుకోను కూడా అని కుష్బూ భావోద్వేగంతో వివరించింది.