Begin typing your search above and press return to search.

ఫనా డైరెక్టర్ తో సందీప్ కిషన్

By:  Tupaki Desk   |   28 May 2017 5:40 AM GMT
ఫనా డైరెక్టర్ తో సందీప్ కిషన్
X
కుర్ర హీరో సందీప్ కిషన్ కెరీర్ ప్రస్తుతం చాలా నెమ్మదించింది. ఈ కుర్రాడితో చేసిన భామలు స్టార్ హీరోయిన్ స్టేటస్ కు దగ్గర అయినా.. సందీప్ మాత్రం ఇంకా కెరీర్ లో కుదురుకోలేకపోయాడు. తమిళ్ లో చేతిలో కొన్ని సినిమాలు ఉన్నా.. తెలుగులో అయితే కృష్ణవంశీ తీస్తున్న నక్షత్రం మినహాయిస్తే మరో సినిమా లేదు.

ఇలాంటి టైంలో ఓ క్రేజీ ఆఫర్ తలుపుతట్టింది. అది కూడా బాలీవుడ్ దర్శకుడు తీస్తున్న సినిమా కావడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్ అన్నంత మాత్రాన హిందీ చిత్రం అనుకోవాల్సిన పని లేదు. బాహుబలి2 ప్రభావంతో తెలుగు సినిమా సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది కదా. అందుకే ఇప్పుడు డైరెక్ట్ మూవీ చేస్తున్నాడు కునాల్ కోహ్లీ. హమ్ తుమ్.. ఆమిర్ తో ఫనా వంటి మూవీస్ తీసిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు టాలీవుడ్ అరంగేట్రం చేస్తూ ఓ మూవీని రూపొందించబోతున్నాడు. దీనికి స్టోరీ రైటర్ కూడా ఈయనే కావడం విశేషం. ఇప్పటికే ప్రాజెక్టు కన్ఫాం అయిపోగా.. జూన్ నెలలో షూటింగ్ ప్రారంభించబోతున్నారట.

పైగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్ నటిస్తుండడం విశేషం. కచ్చితంగా సందీప్ కిషన్ కి ఇది క్రేజీ ఆఫర్ అనాల్సిందే. బాలీవుడ్ డైరెక్టర్.. నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉన్న తమన్నాల కారణంగా.. ఈ ప్రాజెక్టుపై నేషనల్ మీడియా కన్ను కూడా ఉంటుంది. మూవీ ఔట్ పుట్ సరిగ్గా ఉండాలే కానీ.. సందీప్ కి ఇది జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/