Begin typing your search above and press return to search.

పాపం.. తమన్నా.. ఏంటి పరిస్థితి.?

By:  Tupaki Desk   |   17 Aug 2018 5:39 AM GMT
పాపం.. తమన్నా.. ఏంటి పరిస్థితి.?
X
రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలు, హీరోయిన్లకు ఆ తర్వాత సినిమాల్లో ఫ్లాపులు ఎదురవుతాయని ఇండస్ట్రీలో ఒక రకమైన సెంటిమెంట్ ఉంది. సింహాద్రి - యమదొంగ తర్వాత ఎన్టీఆర్.. చత్రపతి తర్వాత ప్రభాస్, విక్రమార్కుడు తర్వాత రవితేజ, సై తర్వాత నితిన్ కూడా విజయం కోసం వేచిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు బాహుబలి లాంటి ప్రపంచ ప్రఖ్యాత చిత్రంలో నటించిన హీరోయిన్ తమన్నా పరిస్థితి కూడా ఇదే రకంగా తయారైంది. ఆ సెంటిమెంట్ మరోసారి పునరావృతమైందని వ్యార్తలు వస్తున్నాయి..

దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న తమన్నాకు ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్టులో మెరిసిన తమన్నకు ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఆమె బాహుబలి క్రేజ్ తో పారితోషకం పెంచేసింది. దీంతో నిర్మాతలు ఈ అమ్మడును తీసుకోవడం లేదు. ఇటీవలే తమన్నా నటించిన ‘నా నువ్వే’ సినిమా కూడా ఆడకపోవడంతో ఇప్పుడు తమన్నాను తీసుకునే వారే కరువయ్యారు. చాలా గ్యాప్ వచ్చేసరికి ఆమెకు డిమాండ్ తగ్గిపోయింది.

ప్రస్తుతం తమన్నా చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. అదే ‘క్వీన్’ రిమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’. ఈ మూవీపైనే బోలేడు ఆశలు పెంచుకుంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వంలో గత ఏడాది మొదలుపెట్టిన ఓ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. సందీప్ కిషన్ తో జోడికట్టిన ఈ మూవీ షూటింగ్ పోయిన సంవత్సరమే పూర్తయ్యింది. కానీ ఇప్పటివరకూ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయకుండా మధ్యలో వదిలేసినట్టు సమాచారం. తెలుగులో మార్కెట్ పూర్తిగా పడిపోయిన సందీప్ హీరోగా ఈ సినిమాలో నటిస్తుండడంతో అస్సలు బజ్ రావడం లేదట.. అందుకే సినిమాను వదిలేశారనే టాక్ వినిపిస్తోంది. ఇలా చేసిన సినిమాలు విడుదల కాక.. కొత్త సినిమాలు చేతిలో లేక తమన్నాకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోందని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు