టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ నటుడు

Sun Sep 23 2018 14:14:20 GMT+0530 (IST)

టాలీవుడ్ అంటే ఇప్పుడు ప్రయోగాలకు వేదిక.  రాజమౌళి లాంటి వారు టాలీవుడ్ సినిమాల మార్కెట్ ను పెంచితే కొత్త తరం ఫిలింమేకర్లు సరికొత్త కాన్సెప్ట్ ల తో ప్రేక్షకుల ముందుకు వస్తూ తెలుగువారినే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులను కూడా అకట్టుకుంటున్నారు. ఇక మన సినిమాలలో పరాయి భాషల నటులు నటించడం ముందు నుంచి ఉన్నదే.  ఈమధ్య ఈ ట్రెండ్ మరింతగా ఊపందుకుంది.  తాజాగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.ఆమీర్ ఖాన్ చిత్రం 'రంగ్ దే బసంతి' లో కీలక పాత్ర పోషించి రికగ్నిషన్ సాధించిన ఈ హిందీ నటుడు చాలా సినిమాల్లో నటించాడు. తాజాగా నాగార్జున - నాని మల్టిస్టారర్ 'దేవదాస్' లో ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే కదా.  తెలుగు సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన స్క్రిప్ట్ చాలా నచ్చిందని.. అందుకే ఎక్కువ ఆలోచించకుండా సైన్ చేసినట్టుగా తెలిపాడు. నాగార్జున సర్.. నాని లిద్దరితో నటించడం సూపర్ ఎక్స్ పీరియన్స్ అని.. ఫుల్ గా ఎంజాయ్ చేశానని చెప్పాడు.

అంతా బాగుంది... ఈ కునాల్ కపూర్ 'దేవదాస్' ట్రైలర్ లో కూడా ఒక చిన్న షాట్ లో అలా కనిపించాడు.. గమనించారా?  ట్రైలర్ లో 1.25 నుండి 1.26 నిముషాల వరకూ చూడండి.. తెల్ల లాల్చీ లో స్టైల్ గా చేతులు జేబులో పెట్టుకుని కూలింగ్ గ్లాసెస్ తో కనిపిస్తాడు. వీలైతే ఓ లుక్కేయండి. ఇక కునాల్ బాబుకు స్వాగతం చెబుదామా.. వెల్కమ్ టూ టాలీవుడ్ కునాల్ కపూరూ..!