Begin typing your search above and press return to search.

కుమారి రేంజు పన్నెండున్నర కోట్లు

By:  Tupaki Desk   |   1 Dec 2015 11:30 AM GMT
కుమారి రేంజు పన్నెండున్నర కోట్లు
X
10 రోజుల్లో మ్యాజిక్‌ అంటే ఇదేనేమో. ఈ మధ్య కాలంలో ఈ రేంజులో దూసుకుపోయిన చిన్న సినిమా అంటే.. అది కేవలం నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్‌ సినిమా అనే చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమా వసూలు చేసిన లైఫ్‌ టైమ్ కలెక్షన్‌ ను రాజ్‌ తరుణ్‌ హీరోగా వచ్చిన 'కుమారి 21 ఎఫ్‌' బీట్‌ చేస్తుందా అనే సందేహం రాక మానదు. 10 రోజుల వసూళ్లు చూస్తే ఆ విషయంపై మనకు క్లారిటీ వచ్చేస్తుంది.

కేవలం పది రోజుల్లో.. ఆంధ్ర తెలంగాణల్లో 10.66 కోట్లు.. కర్ణాటకలో 85 లక్షలు.. అమెరికా బాక్సాఫీస్‌ దగ్గర 80 లక్షలు.. ఇతరత్రా చిన్నాచితకా ఏరియాల్లో మరో 16-20 లక్షల వరకు వసూలు చేసి.. కుమారి 21 ఎఫ్‌ ఇప్పుడు షుమారు 12.5 కోట్లు షేర్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎలాగో ఈ శుక్రవారం శంకరాభరణం సినిమా వచ్చే వరకు.. పెద్దగా పొడిచేసే సినిమాలేవి లేవు. శంకరాభరణం - కిల్లింగ్‌ వీరప్పన్‌ మొదలగు సినిమాలు రిలీజ్‌ అయ్యి ఏమైనా ప్రభావం చూపిస్తే తప్ప కుమారి స్పీడుకు బ్రేకులు పడవు. ప్రస్తుతానికి కుమారి రేంజు 12.5 కోట్లయితే.. రానున్న రోజుల్లో ఈ ఫిగర్‌ ఒక 20-25 టచ్‌ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు ట్రేడ్‌ పండితులు.

ఇంతకీ ఈ విజయం ఎవరి ఖాతాలో వేయాలి? రాజ్‌ తరుణ్‌ హ్యాట్రిక్‌ అనాలా?? అంతటి బోల్డ్‌ రోల్‌ ఒప్పుకున్న హెబా పటేల్‌ గొప్పనాలా?? కాపీ కథే అయినా తెలుగు నేటివిటీకి బ్రహ్మాండంగా ఎడాప్ట్‌ చేసిన సుకుమార్‌ గొప్పనాలా?? లేకపోతే దేవిశ్రీప్రసాద్‌.. రత్నవేలు.. వలనే హిట్టయిందనాలా?? దర్శకుడు సూర్య ప్రతాప్‌ పల్నాటి టాలెంట్ అనాలా?? ఈ సినిమాపై అందరికంటే ఓ రకంగా చూస్తుంటే హెబా పటేల్‌ మార్కు ఎక్కువగా కనిపిస్తున్నట్లు లేదూ...