Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బ్లూ మొనోకిని.. బ్యూటిఫుల్ స్మైల్

By:  Tupaki Desk   |   11 Jun 2019 6:23 AM GMT
ఫోటో స్టొరీ: బ్లూ మొనోకిని..  బ్యూటిఫుల్ స్మైల్
X
సుమంత్ హీరోగా నటించిన 'బోణి' సినిమాతో కృతి కర్బందా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది కానీ ఎందుకో పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. మధ్యలో ఒకసారి చరణ్ సినిమా 'బ్రూస్ లీ' లో చరణ్ కు సోదరిగా నటించింది. ప్రస్తుతం అయితే పూర్తిగా బాలీవుడ్ మీద ఫోకస్ చేసింది. దాంతో పాటు సోషల్ మీడియాపై కూడా ఫోకస్ పెట్టింది. హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు ఒక బ్లూ కలర్ మొనోకిని ధరించి నీళ్ళలోకి దూకింది.. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడింది. ఈ సమయంలో అందమైన ఫోటోలను కూడా తీయించుకుని ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇందులో ఒక ఫోటోలో భుజాల వరకూ మునిగి.. రెండు చేతులతో తన జుట్టును సవరించుకుంటూ పోజిచ్చింది. నీలం రంగులో ఉన్న నీరు.. పూల్ ఒడ్డున ఉన్న పూలు ఈ ఫోటోకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఇక మరో ఫోటోలో నీటిలోకి జంప్ చేస్తూ కనిపించింది. అంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎవరో కానీ సరైన టైమింగ్ తో తీసినందువల్ల కృతి "గాలిలో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే" అనిపించే ఎక్స్ ప్రెషన్ కనిపిస్తోంది.

ఈ ఫోటోలకు నెటిజనులు సూపర్ కామెంట్లు పెట్టారు. "వాటర్ బేబీ".. "ఆజ్ బ్లూ హై పానీ పానీ పానీ".. "కృతి ఈజ్ సో కూల్".. "సబ్సే ఖూబ్ సూరత్.. హసీన్ లడ్కీ" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4'.. 'పాగల్ పంటి'.. 'చెహ్రే' సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో 'వాన్' అనే సినిమాకు ఈమధ్యే సైన్ చేసింది.