ఫోటో స్టోరీ: హిట్టొచ్చాక మెరుస్తోంది

Tue Sep 12 2017 17:14:06 GMT+0530 (IST)

ఎక్కడా కనిపించినా నవ్వుతు చూపరులను ఆకట్టుకునే భామ కృతి సనోన్. మోడల్ గా ఎదిగిన ఈ ముందుగుమ్మ టాలీవుడ్ లో మహేష్ బాబు 1-నేనొక్కడినే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. మొదటి అవకాశం ఊహించని స్టార్ తో వచ్చినా సినిమా సక్సెస్ కాకపోవడంతో అమ్మడు కాస్త డీలా పడింది. కానీ ఏ మాత్రం భయపడకుండా గ్లామర్ షోతో ఇతర సినిమాల్లో నటించింది. ఫైనల్ గా బాలీవుడ్ లో  రాబ్త అనే భారీ బడ్జెట్  సినిమాలో అవకాశం దక్కించుకుంది.కానీ ఆ సినిమాపై కృతి పెట్టుకున్న ఆశాలు అన్ని ఆవిరైపోయాయి. సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ ని తెచ్చుకోలేదు. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఆ చిత్రం నిలిచింది. దీంతో అమ్మడు ఏ హీరోను నమ్ముకోకుండా తనే లీడ్ క్యారెక్టర్ లో చెయ్యడానికి డిసైడ్ అయిపొయింది. ఆ విధంగా రీసెంట్ గా బరేలి కి బర్ఫీ అనే సినిమాను రిలీజ్ చేసి మంచి హిట్ అందుకోంది. అంతే కాకుండా సినిమాలో అమ్మడి నటనకు కూడా మంచి ప్రశంసలే అందుకుంది. దీంతో ఆ విజయాన్ని స్పెయిన్ లో ఎంజాయ్ చేసి వచ్చింది. అయితే రీసెంట్ గా కృతి ఓ ఫ్యాషన్ షోలో సరికొత్తగా మెరిసింది. మోడలింగ్ లో ఎంతో అనుభవం  ఉన్న కృతి ఇప్పుడు ర్యాంపు పై  మెరుస్తూ ట్రెడిషన్ డ్రెస్ లో కనిపించి అందాల్ని ఘాటుగా ఆరబోసింది. చూస్తున్నారుగా ఎలా హొయలు పోతోందో.

మొత్తానికి బాక్స్ ఆఫీస్ ను టచ్ చేసిన కృతికి ఇప్పుడు భారీ ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ఆమె ఇంతకుముందులా ఒకే చేయకుండా భారీ బడ్జెట్ సినిమాలైనా స్టార్ హీరోల సినిమాలైనా కథ కరెక్ట్ గా ఉంటేనే ఒకే చేస్తోందట. ఏదైతే ఏంటి కృతి హిట్ అందుకుంది. మరి ఇప్పుడైనా బిజీ అవుతుందో లేదో చూడాలి.