Begin typing your search above and press return to search.

క్వీన్ తో మహేష్ హీరోయిన్.. రచ్చే

By:  Tupaki Desk   |   28 Oct 2016 10:30 PM GMT
క్వీన్ తో మహేష్ హీరోయిన్.. రచ్చే
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1..నేనొక్కడినే మూవీతో.. టాలీవుడ్ కే కాదు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి సనోన్. మొదటి సినిమా హిట్టు ఫ్లాపు సంగతి పక్కన పెడితే.. ఈ బ్యూటీ యాక్టింగ్ స్కిల్స్ కి బోలెడన్ని మార్కులు పడ్డాయి. అదే జోష్ తో బాలీవుడ్ మూవీ హీరోపంటి(అల్లు అర్జున్ పరుగు కి రీమేక్)లో టైగర్ ష్రాఫ్ తో కలిసి ఎంట్రీ ఇచ్చేసిన కృతి.. ఇప్పుడు తన రేంజ్ అంతకంతకూ పెంచేసుకుంటోంది. ఇప్పటికే షారూక్ ఖాన్ మూవీలో నటించేయగా.. ఇప్పుడీ అమ్మడికి సూపర్బ్ ఆఫర్ తగిలింది.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తో కలిసి ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించబోతోంది కృతి. 'బేర్లీ కీ బర్ఫీ' టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో.. కంగనా లీడ్ రోల్ చేస్తుండగా.. సినిమాకి కీలకమైన ప్రధానమైన ఓ రోల్ లో కృతి సనోన్ కూడా యాక్ట్ చేయనుంది. కంగనా ఉంది కాబట్టి.. ఇదేదో గ్లామర్ రోల్ అనుకోవచ్చు కానీ.. ఈమె చేస్తున్న పాత్ర కూడా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ గానే ఉంటుందని తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లు కలిసి పెర్ఫామెన్స్ తో రచ్చ రచ్చ చేసేయడం ఖాయంగా చెప్పచ్చు.

బేర్లీ కీ బర్ఫీలో ఈ పాత్రకు కృతి సనోన్ ను ఏరికోరి ఎంపిక చేసుకున్నారట. పట్టుమని నాలుగు సినిమాలు చేయకుండానే.. అమ్మడి కోసం కేరక్టర్లు పుడుతున్నాయంటే.. ఫ్యూచర్ లో కృతి సనోన్ రేంజ్ బాగా పెరిగిపోతోందనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/