Begin typing your search above and press return to search.

ఏమీ లేదంటూనే అతడితో మారిషస్ టూర్‌

By:  Tupaki Desk   |   28 July 2016 11:30 AM GMT
ఏమీ లేదంటూనే అతడితో మారిషస్ టూర్‌
X
కృతి సనోన్. అమ్మడు ఈ మధ్యన వార్తల్లో బాగా నానుతోంది. 'రాబ్తా' సినిమా షూటింగు విషయంలో కాకుండా.. అమ్మడు ఆ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలే ఎక్కువగా లైమ్ లైట్లో ఉంటున్నాయి. అయితే మొన్ననే ఈ విషయం గురించి మాట్లాడిన కృతి.. అబ్బే అదంతా రూమరే.. అస్సలు నిజంలేదంటూ చెప్పేసింది.

కట్ చేస్తే.. నిన్న అమ్మడి పుట్టినరోజు. వచ్చే సోమవారం నుండి మారిషస్ లో రాబ్తా సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్. ఇప్పుడు అమ్మడు ఏం చేసిందో తెలుసా?? నిన్న పుట్టినరోజును ముంబయ్ లో సెలబ్రేట్ చేసుకుంటుంది అనుకుంటే.. ఈమె మాత్రం చక్కగా సుశాంత్ తో కలసి మారిషస్ చెక్కేసింది. అదేమంటే షూటింగ్ ఉంది కదా అంటోంది. నాలుగు రోజుల ముందే షూటింగ్ స్పాటుకు చేరుకున్నా అని చెప్పడంలో ఏదో తేడా కొట్టినట్లు అనిపించట్లేదు. అసలు ఇద్దరూ కలసి మారిషస్ ముందే ఎందుకు చెక్కేశారు అనే విషయమే ఇప్పుడు మరోసారి సందేహాలకు దారితీస్తోంది.

సర్లేండి ప్రేమించడం తప్పు కాదు.. డేటింగ్ చేయడమూ తప్పు కాదు. కాని అప్పటికే అంకిత లొకాందే అనే టివి సీరియల్ హీరోయిన్ తో ఐదు సంవత్సారల పాటు లివ్-ఇన్‌ రిలేషన్లో ఉండి.. చివరకు ఆమెకు కటిఫ్‌ చెప్పిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు కృతికి అలాగే హ్యాండిచ్చే ఛాన్సుంది కదా.. కెరియర్ ఇంకా పీక్స్ రాకుండానే ఈ ప్రేమా దోమా ఎందుకు నానా అంటూ స్నేహితులు ఆమెకు క్లాస్ పీకుతున్నారట. అది సంగతి.