Begin typing your search above and press return to search.

ఇంకో హీరోయిన్ సిస్టర్ రెడీ!!

By:  Tupaki Desk   |   5 May 2016 5:30 AM GMT
ఇంకో హీరోయిన్ సిస్టర్ రెడీ!!
X
సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ సక్సెస్ అయితే.. ఆమె వెంట చెల్లెళ్లు క్యూ కట్టేస్తుంటారు. ఇలా వచ్చినవారిలో సక్సెస్ సాధించిన వారు తక్కువగానే ఉన్నా.. వస్తున్నవారి కౌంట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఇలా సినీ అరంగేట్రం చేసేయగా.. ఇప్పుడు మహేష్ బాబు 1 నేనొక్కడినే మూవీ హీరోయిన్ కృతి సనోన్ చెల్లి కూడా వచ్చేస్తోంది.

కృతి సనోన్ చెల్లెలి పేరు నూపుర్. త్వరలో సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం అక్క కూడా బాగానే హెల్ప్ చేస్తోంది. తనతోపాటు సెట్స్ దగ్గరకు కూడా తీసుకెళ్తోంది. అయితే.. మన దగ్గర ఇలా హీరోయిన్ సిస్టర్లు పెద్దగా సక్సెస్‌ కాలేదు. కాజల్‌ అగర్వాల్ చెల్లి నిషా - సంజన చెల్లి నిక్కీ గల్రాని - ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి.. వీరంతా అరంగేట్రంతో మంచి ఛాన్సులు సంపాదించుకున్నారు కానీ.. సక్సెస్ సాధించలేకపోయారు.

ఓ జనరేషన్ వెనక్కి వెళితే.. టాప్ హీరోయిన్ గా వెలిగిన జ్యోతిక కూడా నగ్మా చెల్లెలిగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈమె సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయింది కానీ.. జ్యోతిక చెల్లెలు రోష్ణి మాత్రం మెగాస్టార్ చిరంజీవితో నటించినా టాప్ హీరోయిన్ కాలేకపోయింది. మరిప్పుడు నూపుర్ ఫ్యూచర్ ఎలా ఉండనుందో!