Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫ్యాషన్ షోలో మెరుపులు

By:  Tupaki Desk   |   21 Aug 2017 4:29 AM GMT
ఫోటో స్టోరి: ఫ్యాషన్ షోలో మెరుపులు
X
ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తూ ఉంటారు మన హీరోయిన్లు. అసలు సినిమాలకు కొత్త అందం వచ్చేదే మన అందాల ముద్దుగుమ్మల వలన. అయితే ఇప్పుడు హీరోయిన్ అందాలను దారబోయడానికి సినిమాలు ఒక్కటే మీడియం కాదు కదా ఫోటో షూట్లు ఉన్నాయి ఫ్యాషన్ షో లు ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది. అక్కడ కూడా దారబోస్తున్న కృతి సనోన్ ను ఒక్కసారి చూద్దాం పదండి.

మహేశ్ బాబు 1-నేనొక్కడినే సినిమాలో మెరిసిన మెరుపు తీగ కృతి సనోన్ ఇప్పుడు బాలీవుడ్ లో బరేలి కి బర్ఫీ సినిమాతో అనుకోని విజయం సొంతం చేసుకొంది. ఈ సినిమా కోసం ప్రచారం కూడా బాగానే చేసింది. రాబ్తా సినిమా కోసం ఫిట్ గా మారిన కృతి ఇప్పుడు లాక్మే ఫ్యాషన్ లో షో టాపర్ గా నడిచి తన అందాలతో అదరగొట్టేసింది. నార్త్ ఇండియాలో ఫేమస్ పెళ్లి దుస్తులలో ఒక వస్త్ర కట్టును తన సొగసుతో ధరించి ఆ డిజైన్ కు మరింత అందాన్ని తెచ్చింది. పర్పుల్ రంగు కు కొన్ని ఎంబ్రాయిడరీ డిజైన్ జతచేసి కృతి సనోన్ వేసుకున్న డ్రెస్స్ ఆ ఫ్యాషన్ షో కే మెరుపులు తెప్పించింది.

హిందీలో చేసిన మొదటి సినిమా హిరోపంతి తోనే మంచి ఫేమస్ ఆయన కృతి ఇప్పుడు కొత్త అందాలతో బాలీవుడ్ సితారలలో ఒకర్తిగా మారింది. రాబ్తా హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోందోని ఆ మధ్య వార్తలు ఎక్కువగానే వచ్చాయి. అయితే వీళ్ళద్దరు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సినిమాలు పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా కృతి సనోన్ ఇప్పుడు హాట్ హీరోయిన్లు లిస్ట్ చోటు సంపాదించేసింది.