Begin typing your search above and press return to search.

మహేష్ బ్యూటీకి కనెక్షన్ ఎవరితోనంటే

By:  Tupaki Desk   |   22 Sep 2017 3:30 PM GMT
మహేష్ బ్యూటీకి కనెక్షన్ ఎవరితోనంటే
X
మహేష్ బాబు మూవీ 1నేనొక్కడినే చిత్రంతో సినిమా రంగానికి పరిచయమైన బ్యూటీ కృతి సనోన్. టాలీవుడ్ లో కాలం కలిసిరాకపోవడం.. అదే సమయంలో బాలీవుడ్ నుంచి పిలుపు అందడంతో.. ఎంచక్కా అక్కడ వాలిపోయింది ఈ భామ. అక్కడేమీ పెద్ద పెద్ద హిట్స్ కొట్టేయలేదు కానీ.. మంచి గుర్తింపును మాత్రం సంపాదించుకోగలిగింది.

రాబ్తా అనే మూవీలో సుశాంత్ రాజ్ పుత్ తో కలిసి నటించిన ఈ భామ.. సక్సెస్ కొట్టలేకపోయినా.. ఆ మూవీ టైటిల్ కి అర్ధం అయిన కనెక్షన్ ను.. రియల్ లైఫ్ లో సుశాంత్ తో నడిపేస్తోందనే టాక్ మాత్రం తెచ్చుకుంది. వీరిద్దరి రిలేషన్ బాగానే కంటిన్యూ అవుతోంది. కొత్త కారు కొంటే కృతిని ఎక్కించుకుని తిప్పడం.. ఈ భామ సినిమా రిలీజ్ అంటే తను ప్రచారం చేయడం లాంటివి చేస్తున్నాడు ఆన్ స్క్రీన్ ధోనీ. అయితే.. ఇప్పుడీ బ్యూటీకి కొత్త కనెక్షన్ ఏర్పడిపోయింది. అలాగని ఇంకో లవర్ ను వెతికేసుకుందని కాదు కానీ.. కొంచెం అలాంటిదే. యాపిల్ సంస్థ అందించే సిరి సాఫ్ట్ వేర్ తో తనకేదో కనెక్షన్ ఉందని ఈ భామ ఫిక్స్ అయిపోయింది. ఇందుకు కారణం కూడా ఉంది లెండి. అదేంటో చూపించింది కూడా.

రీసెంట్ గా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కృతి. సిరి సాఫ్ట్ వేర్ ను తనకోసం ఓ పాట పాడమని అడిగితే.. ఒకటికి నాలుగు సార్లు అడిగించుకుని.. చివరకు 'ఎక్ వరి ఆ భి జా యారా' పాటను అందుకుంది సిరి. ఈ పాట రాబ్తా చిత్రంలోనిదే అని తెలిసిందే. దీంతో షాక్ తినేసి.. తనకు సిరితో ఏదో కనెక్షన్(రాబ్తా)ఉందని ఫిక్స్ అయిపోయింది కృతి సనోన్