Begin typing your search above and press return to search.

మహేష్ హీరోయిన్ కి ఆ ఒక్కటి కావాలంట

By:  Tupaki Desk   |   24 Nov 2015 10:30 PM GMT
మహేష్ హీరోయిన్ కి ఆ ఒక్కటి కావాలంట
X
క్రితి సనన్ కి టాలీవుడ్ రెండు మంచి ఆఫర్స్ ఇచ్చింది కానీ.. ఈ భామ కెరీర్ కి అవేమీ ఉపయోగపడలేదు. మహేష్ బాబు పక్కన వన్ నేనొక్కడినే, నాగచైతన్యతో దోచెయ్ చిత్రాల్లో మెరిసినా.. తెలుగు ఇండస్ట్రీలో ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది క్రితి.

హీరోపంటి మూవీతో లాంఛింగ్ తోనే ప్రేక్షకులు, మేకర్స్ కంట్లో పడింది ఈ ఈ హీరోయిన్. వెంటనే షారూక్, కాజోల్ నటిస్తున్న దిల్ వాలే మూవీలో ఆఫర్ పట్టేసింది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన రొమాన్స్ చేస్తున్న క్రితి.. దిల్ వాలే హిట్ కావడంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే.. అన్నీ పుష్కలంగా ఈ చిన్నదానికి ఇప్పుడు అర్జంటుగా బంపర్ హిట్ ఒకటి కావాలి. దానికోసం గట్టిగానే ట్రై చేస్తోంది. తను ఎదురు చూస్తున్న హిట్ ని.. షారూక్ ఇస్తాడని ఆశలు పెట్టుకుంది.

దిల్ వాలే చిత్రానికి సంబంధించి ఇప్పటికే షారూక్, కాజోల్ సాంగ్ రిలీజ్ కాగా.. ఇప్పుడు వరుణ్ ధావన్, క్రితి సనోన్ లపై ఓ రొమాంటింగ్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత తనకు బోలెడన్ని ఆఫర్స్ తలుపు తడతాయని ఆశలుపెట్టుకుంది క్రితి. రీసెంట్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన ఓ మూవీకి సైన్ చేసింది ఈ సుందరి. ఇది రొమాంటిక్ కామెడీ కావడంతో.. దీనిపైనా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే.. ఈ భామ ఆశిస్తున్న బ్రేక్ ని షారూక్ ఇస్తాడో లేదో తెలిసేందుకు మరో నెల రోజులు ఆగాల్సిందే.