Begin typing your search above and press return to search.

అందమైన బ్యూటి.. పరుపుపై చిందులు

By:  Tupaki Desk   |   24 July 2017 5:12 AM GMT
అందమైన బ్యూటి.. పరుపుపై చిందులు
X
బాలీవుడ్ సినిమాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది అది ఏంటంటే పాత వాటిని కొత్తగా చెప్పడం. కొన్నేళ్ళ కిందట మంచి హిట్ సినిమానో లేక పాటనో రీమేక్ చేసి ఇప్పటి వాళ్ళకి కూడా ఆ మజాని అందిస్తున్నారు. వచ్చే వారం విడుదల కాబోతున్న ముబారకన్ సినిమాలో పాత బాలీవుడ్ పాట హవా హవా ను మళ్ళీ రీమేక్ చేసి హిట్ కొట్టారు. అర్జున్ కపూర్ ద్విపాత్ర అభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక అర్జున్ కపూర్ ఇలియానా డిక్రూజ్ తో కలిసి హవా హవా పాటకు చిందులు వేసాడు.

ఇప్పుడు కొంత మంది యువ బాలీవుడ్ నటులు ఈ పాట పై తమ అభిమానాన్ని వాళ్ళ స్టైల్ లో చెబుతున్నారు. ఎనర్జి స్టార్ రణవీర్ ఈ పాటకు ఇది వరకే ముబారకన్ హీరోయిన్ ఇలియానాతో చిందేసి అర్జున్ కపూర్ కి తన సపోర్ట్ తెలిపాడు. అలాగే విక్కీ డోనార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తన సంగీతం పిచ్చి కొంచెం జోడించి ఒక కొత్త పద్దతిలో పాడి ఆ పాటకు ఈ సినిమాకు తన మద్దతు తెలిపాడు. ఇప్పుడు కృతి సనోన్ వంతు వచ్చింది. ఆమె కొంత చిలిపితనం కలిపి చూసే వారిని కవ్వించింది. అందమైన గౌన్ వేసుకొని పరుపు పై హవా హవా బీట్ కు తన సొగసలు జత చేసి చిందులు వేసింది. మెత్తని పరుపు పై పాటను అభినయం చేస్తూ మురిపించింది. ఆ పాటలో స్టెప్లు తనదైన స్టైల్ లో వేసి చివరకు బ్యాలెన్స్ తప్పి పరుపు పై పడింది. తన ఆనందం చూస్తేనే మనకు అర్ధం అవుతుంది ఈ పాటకు అప్పటిలో ఎంత క్రేజ్ ఉండేదో

ఈ వీడియోకి పేరు ఏంటి పెట్టింది అంటే ‘హవా హవా సాంగ్ ప్లే అయితే ఇలా మీరు ఎలాంటి గౌన్ వేసుకున్న పర్వాలేదు మీ షూస్ పక్కకు విసిరేసి చిందు వేయండి’. అని సలహా కూడా ఇచ్చింది అమ్మడు. మొత్తానికి తన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పక్క సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మంచి పిల్ల అనిపించుకుంటోందీ భామ. ఈ మధ్యనే ఈమె నటించిన రాబ్తా రిలీజై ఫ్లాపైన సంగతి తెలిసిందే.