Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నలుపు డ్రెస్ లో జాబిల్లి

By:  Tupaki Desk   |   25 Sep 2017 10:33 AM GMT
ఫోటో స్టోరి: నలుపు డ్రెస్ లో జాబిల్లి
X
మోడలింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన భామ కృతి సనోన్. ఆ తర్వాత కొద్దీ రోజులకే అమ్మడికి సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ ఎందుకో ఏ సినిమాలను ఒప్పుకోలేదు. బాలీవుడ్ ఆఫర్లను సైతం లెక్క చేయలేదు. ఎంట్రీ సూపర్బ్ గా ఉండాలనుకుందేమో మరి మహేష్ సరసన 1 నేనొక్కడినే సినిమాలో డిఫరెంట్ రోల్ లో కనిపించింది. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అమ్మడు చాలా నిరాశ చెందింది.

కానీ ఆ నిరాశను ఎక్కువ రోజులు పట్టించుకోలేదు. చిన్న సినిమాలైనా సరే చేసుకుంటూ వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంది. చివరికి బరైల్లి కి బర్ఫీ సినిమాతో సోలో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు కృతి కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా గ్రాండ్ వెల్కమ్స్ అందుతున్నాయి. అదే తరహాలో రీసెంట్ గా వోగ్ ఉమెన్ అఫ్ ది ఇయర్ అవార్డుల వేడుకకి వెళ్ళింది.

కృతి అక్కడకి ఒక స్పెషల్ డ్రెస్ లో వచ్చింది. ఎవరు ఊహించని డ్రెస్ లో అమ్మడు నాజూకు నడుముపై మడతలు పడేలా డ్రెస్ వేసుకున్న విధానం చూపరులను తెగ ఆకట్టుకుంది. నలుపురంగు డ్రెస్ లో ఉన్న కృతి ని చూస్తే ఎవ్వరికైనా నల్లటి చీకట్లో చందమామ ఉందా ఏంటి? అనేలా సందేహం కలుగక మానదు. హెయిర్ స్టయిలే కూడా చాలా కొత్తగా ఉంది. మొత్తానికి అమ్మడు ఆ వేడుకలో అందానికే అందం అనేలా కనిపించింది.