బ్లాక్ డ్రెస్ లో `హౌస్ ఫుల్` బ్యూటీస్ రచ్చ!

Sat Jul 14 2018 22:00:29 GMT+0530 (IST)

బాలీవుడ్ లో `హౌస్ ఫుల్` సిరీస్ లో ఇప్పటివరకు మూడు బ్లాక్ బస్టర్ హిట్ లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు అదే సిరీస్ లో మరో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ - దర్శకురాలు ఫరాహ్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్ లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటిస్తోన్న హీరోయిన్లు కృతి సనన్ - కృతి కర్బందా - పూజా హెగ్డేలు బ్లాక్ డ్రెస్ లో హాట్ గా ఫొటోలకు పోజులిచ్చారు. ఫరాహ్ తో కలిసి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు దిగిన బ్లాక్ థీమ్ హాట్ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను బట్టి...`హౌస్ ఫుల్ -4`లో ప్రేక్షకులను మరోసారి భారీగా గ్లామర్ డోస్ తో అలరించేందుకు సాజిద్ రెడీ అయినట్లు కనిపిస్తోంది.ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ లో అక్షయ్ కుమార - రితీష్ దేశ్ ముఖ్ - బాబీ డియోల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. `హౌస్ ఫుల్ -3`లో సందడి చేసిన అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్ ను తీసుకున్నారు. ప్రస్తుతం లండన్ లో 25 రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. అంతకుముందు ఈ చిత్ర హీరోలతో సెల్ఫీలను తీసుకున్న ఫరాహ్ ....సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రితీష్ ను ముద్దాడుతున్న ఫరాహ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. `చాలా రోజుల తర్వాత నా డార్లింగ్ రితీష్ తో షూటింగ్ జరుపుతున్నాను` అంటూ ఫరాహ్ పోస్ట్ చేశారు. దీపావళి కానుకగా `హౌస్ ఫుల్ -4`ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సాజిద్ ప్లాన్ చేస్తున్నారు.