బ్రూస్ లీ భామ చెలరేగిపోతోంది

Mon Apr 16 2018 22:00:59 GMT+0530 (IST)

ఢిల్లీ భామ కృతి కర్బందా ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ ఫామ్ లోకి వెళ్లేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు సినిమాతోనే బోణీ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించినా అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. తెలుగు బ్రూస్ లీలో రామ్ చరణ్ కు అక్కగాను.. తమిళ బ్రూస్ లీలో హీరోకు లవర్ గాను నటించింది కృతి కర్బందా.ఆ తర్వాత రాజ్ రీబూట్ అంటూ బాలీవుడ్ లో అడుగు పెట్టడంతోనే సెన్సేషన్ సృష్టించేసింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి కర్బందా చేతిలో.. ఇప్పుడు మూడు నాలుగు హిందీ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాసిన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉండడం విశేషం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ ను బాగా వంత పట్టించేసుకుంది. అందుకే తను ఫామ్ లో ఉండగానే.. క్రేజ్ ను మరింతగా పెంచుకునేందుకు ప్లాన్స్ ను అప్లై చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేస్తున్న హంగామా అయితే మామూలుగా లేదు.

హాట్ హాట్ ఫోటోలను నెట్ లో పెట్టేస్తోంది కృతి కర్బందా. అటు గ్లామర్ ను అంతంతమాత్రంగానే చూపిస్తున్నా.. ఈ భామలో ఉన్న అట్రాక్టివ్ నెస్ ను చెప్పేందుకు మాత్రం మాటలు అస్సలు చాలవు. ఇప్పటికి పరిమితంగానే గ్లామర్ డోస్ చూపించినా.. అందాల ఆరబోత విషయంలో తన స్థాయిని చెప్పకనే చెబుతోంది కృతి కర్బందా. అల్ట్రా మోడర్న్ బ్యూటికి అసలు సిసలైన అర్ధం చెప్పేందుకు తాను సిద్ధం అంటూ ఇండికేషన్స్ ఇస్తోంది కృతి