Begin typing your search above and press return to search.

నిధానంగా ఛాన్సులు పట్టేస్తోందే

By:  Tupaki Desk   |   16 Aug 2017 7:37 PM GMT
నిధానంగా ఛాన్సులు పట్టేస్తోందే
X
కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే సూపర్ స్టార్లు అయిపోతారు. అదే మన సమంత తరహాలో. కాని కొంతమందికి చాలాసినిమాలు చేస్తే కాని స్టార్డమ్ రాదు. అదే మన రకుల్ తరహాలో అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి బాలీవుడ్ వెళ్ళి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఒక హీరోయిన్ ను చూస్తే అదే తరహాలో అనిపిస్తోంది.

బోణి సినిమాతో తెలుగులో బోణి చేసిన బెంగుళూరు బ్యూటి కృతి కర్భందా.. తరువాత పవన్ కళ్యాణ్‌ సినిమాలో చేసినా కూడా బ్రేక్ తెచ్చుకోలేదు. పోనివ్ హోమ్లీ పాత్రలు వదిలిపెట్టేసి పూర్తి స్థాయిలో గ్లామర్ ఆరబోస్తూ సినిమాలు చేసినా.. చివరకు రామ్ చరణ్ అక్క రోల్ ఇచ్చారు. దానితో అమ్మడు బాలీవుడ్ చెక్కేసి అక్కడ రాజ్ రీబూట్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా ఫ్లాపైనా కూడా ఈమె చేతిలో ఆఫర్లు మాత్రం పడ్డాయి. గెస్ట్ ఇన్ లండన్ అంటూ అమ్మడు చేసిన రెండో సినిమా కూడా ఆడలేదు. కాని ఇప్పుడు సన్నీ డియోల్ బాబీ డియోల్ కాంబినేషన్లో.. యమ్లా పగ్లా దివానా ఫిర్సే అంటూ రూపొందుతున్న సినిమాలో ఈ సుందరి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.

చూస్తుంటే నిధానంగా బాలీవుడ్లో బిజీ అయిపోయేలా ఉంది కృతి. అందుకే ఇప్పుడు కాస్త టైమ్ దొరకగానే అమ్మడు శ్రీలంక వెళ్ళి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బౌద్ధ ఆశ్రమాలను సందర్శిస్తూ కాలం గడిపేస్తోంది.