Begin typing your search above and press return to search.

ఈ సెగలు సరే.. ఛాన్సులు రావట్లేదు

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:38 PM GMT
ఈ సెగలు సరే.. ఛాన్సులు రావట్లేదు
X
కృతికర్భంద .. పరిచయం అక్కర్లే ని పేరు ఇది. బోణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత పవన్‌ సరసన తీన్‌ మార్‌ చిత్రంలో ఒక కథానాయికగా నటించింది. అయితే తీన్‌ మార్‌ పరాజయం పాలవ్వడంతో ఓవర్‌ నైట్‌ సీను బ్యాడైపోయింది.

స్టార్‌ హీరోయిన్‌ కావాల్సింది కాస్తా సాదాసీదా హీరోయిన్‌ గానే మిగిలిపోవాల్సొచ్చింది. కళ్యాణ్‌ రామ్‌ ఓం3డి సినిమాలో నాయికగా నటించినా సేమ్‌ రిజల్ట్‌ ఉస్సురనిపించింది. ఆ సినిమా కూడా బక్సాఫీస్‌ వద్ద ఫ్లాపైంది. అలా వచ్చిన ప్రతి అవకాశమూ అమ్మడికి నిరాశనే మిగిల్చింది. దాంతో కెరీర్‌ లో పూర్తిగా వెనకబడిపోయింది. ఇటీవలే అనూహ్యంగా రామ్‌ చరణ్‌ సినిమాలో అవకాశం దక్కించుకోగలిగింది. చెర్రీకి సోదరి పాత్రలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. పవన్‌ తో తనకి ఉన్న కాంటాక్ట్‌ వల్ల ఈ అవకాశం వచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. కనీసం అక్క, చెల్లి పాత్ర ల్లోనైనా ఇకనుంచి పట్టు బిగించాలని నిర్ణయించుకుందో ఏమో.. టాలీవుడ్‌ లో బెట్టు సడలించింది.

ఇదిగో ఈ ఛాయాచిత్రంలోని సెగలు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. కథానాయికగా కావాల్సినన్ని ఫీచర్స్‌ నాలో ఉన్నాయి. ఉపయోగించుకునే తెలివితేటలు మీకుండాలే కానీ...? అన్నట్టు లేదూ ఈ ఎక్స్‌ ప్రెషన్‌? సెగలు సరే.. తెలుగులో కథానాయికగా అవకాశాలు ఎందుకు పెరగట్లేదంటావ్‌?