Begin typing your search above and press return to search.

అక్కడ వెలగాలంటున్న డ్రామా క్వీన్

By:  Tupaki Desk   |   24 April 2018 7:39 AM GMT
అక్కడ వెలగాలంటున్న డ్రామా క్వీన్
X
కృతి కర్బందాకు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో పాతుకుపోయింది. మళ్లీ టాలీవుడ్ ను పలకరించింది. కోలీవుడ్ నుంచి ఛాన్స్ వస్తే అందిపుచ్చుకుంది. అటు పిమ్మట తన అంతిమ లక్ష్యం అయిన బాలీవుడ్ నుంచి అవకాశం రాగానే.. ఎంచక్కా అక్కడ వాలిపోయింది కృతి కర్బందా.

సౌత్ లో ఉన్న దాదాపు అన్ని భాషల్లోను నటించిన అమ్మడిలోని గ్లామరసం అంతగా బయటకు రాలేదు. కానీ బాలీవుడ్ వెళ్లిన మహత్యమో ఏమో కానీ.. అక్కడికి చేరినప్పటి నుంచి కంప్లీట్ గా మారిపోయింది ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా.. ఫోటో షూట్స్ లో కూడా అందాలు పంచడం కామన్ అయిపోయింది. మరోవైపు ఈ బ్రూస్ లీ బ్యూటీ సోషల్ మీడియాను కించిత్ కూడా క్షమించడం లేదు. సొగసులు ధారపోస్తున్న ఫోటోలను ఏరికోరి మరీ ఎంపిక చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేస్తోంది.

తాజాగా క్లీవేజ్ అందాలను పదిలంగా కెమేరా ముందు చూపిస్తూ.. ఓ సూపర్బ్ పోజ్ ఇచ్చి.. ఆ ఫోటోను అభిమానులకు పంచింది కృతి కర్బందా. ఈ ఫోటోనే గిలిగింతలు పెడుతుంటే.. 'లెట్ దేర్ బి లైట్' అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా ఓ కామెంట్ ను తనే రాసుకుంది కృతి కర్బందా. ఇంతకీ ఈమెకు డ్రామా క్వీన్ అనే పేరు ఎలా వచ్చిందంటే.. తన గురించిన డిస్క్రిప్షన్ లో తనే అలా రాసుకుంది ఈ బ్యూటీ.