Begin typing your search above and press return to search.

కృష్ణం రాజు ప్రభాస్ ను బలి చేస్తాడా?

By:  Tupaki Desk   |   1 Dec 2015 11:30 AM GMT
కృష్ణం రాజు ప్రభాస్ ను బలి చేస్తాడా?
X
అవును ప్రభాస్ అభిమానులు ఇలాగే ఫీలవుతున్నారిప్పుడు. కృష్ణం రాజు తన ముచ్చట తీర్చుకోవడానికి ప్రభాస్ ను ఎక్కడ బలి చేస్తాడో అన్నది వాళ్ల టెన్షన్. కృష్ణం రాజుకి దర్శకత్వం మీద చాలా మోజుంది. ఆ మోజును ప్రభాస్ సినిమాతోనే తీర్చుకోవాలని ఆయన కలలు కంటున్నారు. తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘భక్త కన్నప్ప’ను ప్రభాస్ హీరోగా రీమేక్ చేయాలని ఒకప్పుడు కలలు కన్నారాయన. ఆ తర్వాత ‘ఒక్క అడుగు’ తీద్దామని చూశారు. ఐతే పరిస్థితులు అనుకూలించకో.. ప్రభాస్ డేట్లు లేకపోవడం వల్లో.. కృష్ణం రాజు కల నెరవేరడం లేదు.

ఐతే బాహుబలి-2 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ హీరోగా సినిమా చేసి తీరాల్సిందే అని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. తన గోపీకృష్ణ మూవీస్ బేనర్ పేరు మీద ఫిలిం ఛాంబర్లో ‘దందా’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించింది ప్రభాస్ కోసమేనట. ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించాలని కూడా కృష్ణం రాజు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇంతకుముందైనే చెల్లిపోయేది కానీ.. ‘బాహుబలి’ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయిన ప్రభాస్ ఇప్పుడు తన పెదనాన్న దర్శకత్వంలో సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభాస్ అభిమానులకైతే ఈ కాంబినేషన్ విషయంలో ఏమాత్రం ఆసక్తి లేదు. కృష్ణం రాజు తన డైరెక్షన్ ముచ్చట తీర్చుకోవడానికి ప్రభాస్ ను బలి ఇస్తాడా అని ప్రశ్నిస్తున్నారు వాళ్లు.