Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ దందా చేస్తాడా?!

By:  Tupaki Desk   |   30 Nov 2015 7:17 AM GMT
ప్ర‌భాస్ దందా చేస్తాడా?!
X
బాహుబ‌లి విడుద‌ల‌కు ముందు కొత్తగా చేయ‌నున్న సినిమాలేంటి అని ప్ర‌భాస్‌ ని అడిగిన‌ప్పుడు ఆయ‌న చెప్పిన స‌మాధానం ఒక్క‌టే. మా గోపీకృష్ణ బ్యాన‌ర్‌ లో సినిమాలు చేయ‌బోతున్నాన‌ని! గోపీకృష్ణ బ్యాన‌ర్ ప్ర‌భాస్ సొంత సంస్థ‌. ఆయ‌న పెద‌నాన్న కృష్ణంరాజు ఆ సంస్థ వ్య‌వహారాల్ని చూసుకుంటుంటాడు. అయితే ఆ సంస్థ ఇటీవ‌ల దందా అనే పేరుని ఫిలిం ఛాంబ‌ర్‌ లో రిజిస్ట‌ర్ చేయించింది. దీంతో దందా అన్న పేరుతో ప్ర‌భాసే సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు మాట్లాడుకుంటున్నారు. మ‌రి నిజంగానే ప్ర‌భాస్‌ కోస‌మే ఆ టైటిల్‌ ని రిజిస్ట‌ర్ చేయించారా? లేక ఆ సంస్థ‌లో ప్ర‌భాస్‌ తో కాకుండా వేరొక‌రితో ఏమైనా సినిమాని నిర్మించ‌బోతున్నారా అన్న‌ది తెలియాల్సి వుంది.

ప్ర‌భాస్ కోసం కృష్ణంరాజు స్వ‌యంగా ఒక్క అడుగు అనే క‌థ‌ని త‌యారు చేశాడు. దాంతోపాటు భ‌క్త‌క‌న్న‌ప్ప సినిమాని కూడా ప్ర‌భాస్‌ పై రీమేక్ చేస్తే బాగుంటుంద‌నేది కృష్ణంరాజు ఆలోచ‌న‌. ఈ రెండింటిలో ఏదో ఒకటి బాహుబ‌లి త‌ర్వాత సెట్స్‌ పైకి వెళ్లొచ్చ‌ని ఊహించారంతా. అయితే ప్ర‌భాస్ మాత్రం త‌న స్నేహితుల సంస్థ అయిన యువీ క్రియేష‌న్స్‌ లో ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజీత్‌ తోనూ ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. అస‌లు వీటిలో ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమా ఏద‌న్న‌ది మాత్రం బాహుబ‌లి 2 త‌ర్వాత కానీ తెలిసే అవ‌కాశం ఉండ‌దు. కానీ ఇంత‌లో దందా అనే తెర‌పైకి రావ‌డం అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఆ పేరు మాస్‌ కి త‌గ్గ‌ట్టుగానే ఉంది. నిజంగా ఆ పేరుతో ప్ర‌భాస్ సినిమా చేస్తే బాగానే ఉంటుంది. దీనిపై ప్ర‌భాస్‌ కానీ - కృష్ణంరాజు కానీ క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి.