Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: బాలయ్య ఫ్యాన్.. భయం ఎక్కువే..

By:  Tupaki Desk   |   20 Jan 2016 5:08 PM GMT
ట్రైలర్ టాక్: బాలయ్య ఫ్యాన్.. భయం ఎక్కువే..
X
నేచురల్ స్టార్ నాని ఎంచుకునే సబ్జెక్ట్ తోనే సగం హిట్ టాక్ వచ్చేస్తూ ఉంటుంది. తనకు సరిపోయే పాత్రలను సెలక్ట్ చేసుకోవడంలో అంత పర్ ఫెక్ట్ గా ఉంటాడు ఈ హీరో. భలేభలే మగాడివోయ్ లో మతిమరుపు కేరక్టర్ తో నవ్వులు పూయించిన నాని.. ఈ సారి భయం అంటున్నాడు. ఇప్పుడు ఈ కుర్ర స్టార్ చేస్తున్న కృష్ణ గాడి వీర ప్రేమగాధలో.. పిరికి వాడి కేరక్టర్ తో ఫుల్లు కామెడీ పంచుతున్నాడు.

కృష్ణగాడి వీర ప్రేమగాధకు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. డిఫరెంట్ గా ఉండడమే కాదు.. మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తిగా, ఎక్కడా కామెడీ మిస్ కాకుండా సూపర్బ్ గా ఉందని చెప్పాలి. ఓ పల్లెటూళ్లో అంతగా చదువు సంధ్యా లేని హీరో, స్టడీస్ కంటిన్యూ చేస్తున్న హీరోయిన్.. కాంబినేషన్ బాగానే సెట్ అయింది. ప్రపంచానికి తెలిసేలా తిట్టుకోవడం, ఎవరికీ తెలికుండా ప్రేమించుకోవడం, ప్రేమను వ్యతిరేకించే హీరోయిన్ చుట్టూరా జనాలు.. ఇవన్నీ సాధారణంగానే అనిపిస్తున్నా.. ఆ కేరక్టర్లో నాని ఉండడంతోనే అసలు మజా కనిపిస్తోంది.

హీరోయిన్ ని సాధించుకోవడం కోసం చిన్న పిల్లలను కిడ్నాప్ చేసేసి ఇబ్బందులు పడ్డం ఈ మూవీలో మరో ఎపిసోడ్. మా ఇల్లెక్కడో తప్పిపోయింది, కనిపించడం లేదు అంటూ ఓ బుడత చెప్పిన డైలాగ్.. ట్రైలర్ కే హైలైట్ అనాల్సిందే. మొత్తానికి పిరికివాడి నుంచి హీరోయిన్ ని గెలుచుకునే హీరోగా కనిపించబోతున్నాడు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ని చాలా అందంగా చూపించాడు డైరెక్టర్ హను రాఘవపూడి. చూస్తుటే మెహ్రీన్ ని మరో అందాల రాక్షసి చేసేట్టున్నాడు.

మొత్తం మీద సినిమాపై అంచనాలను నాలుగింతలు చేసేసింది ఈ ట్రైలర్. అవును.. బాలయ్య ఫాన్ గా నాని నటిస్తున్న మూవీ ట్రైలర్ ని అసలు బాలయ్య పేరెత్తకుండానే, ఫినిష్ చేసేయడం హైలైట్. చూస్తుంటే ఆ విశేషాలను థియేటర్లోనే చూడమని చెబుతున్నట్లుగా ఉంది.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి : https://goo.gl/WLpJNc