Begin typing your search above and press return to search.

నానికి కెరీర్ బెస్ట్ ఇదేనన్నమాట

By:  Tupaki Desk   |   7 Feb 2016 7:30 PM GMT
నానికి కెరీర్ బెస్ట్ ఇదేనన్నమాట
X
ఒకే ఒక్క సినిమా నాని తలరాతను మార్చేసింది. ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో అతడి రేంజే మారిపోయింది. ఆ సినిమా టైటిల్స్ లో ఏదో తమాషాగా ‘నేచురల్ స్టార్’ అని వేశారు కానీ.. విడుదల తర్వాత నిజంగానే నానికి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అతడి తర్వాతి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’కు రూ.15 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నాని కూడా రూ.4 కోట్ల దాకా రెమ్యూనరేన్ తీసుకునే స్థాయికి వచ్చేశాడు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. నాని కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి వస్తాయన్న విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

14 రీల్స్ సంస్థ స్టామినా ఏంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల సినిమా తరహాలో భారీగానే రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 800కు పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. 14 రీల్స్ వాళ్లకు యుఎస్ లోనూ మంచి నెట్ వర్క్ ఉంది. అక్కడ ఈ చిత్రాన్ని వందకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. ‘భలే భలే మగాడివోయ్’ కూడా అక్కడ వందకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే టూమచ్ అన్నారు. కానీ ఆ సినిమా ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మీద కూడా మంచి అంచనాలున్నాయి కాబట్టి ఇది కూడా మంచి కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. సినిమా మీద అన్ని విధాలుగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించడమన్నది ముందే ఫిక్స్ అయిపోయింది.