రుద్రాక్ష - నక్షత్రాలు మనకెందుకు బాస్

Mon Feb 18 2019 13:37:05 GMT+0530 (IST)

 కృష్ణవంశీ పేరు చెప్తే ఒకప్పుడు క్రియేటివిటి అమ్మా మొగుడు అనే ట్యాగ్ లైన్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలంటే జనం భయపడే రేంజ్ కు వచ్చేశాడు. ఒక్క కృష్ణవంశీయే కాదు… వర్మ బ్యాచ్ నుంచి వచ్చిన అందరూ (వర్మ - వంశీ - పూరీ) బ్యాడ్ ఫేజ్ ని ఎదుర్కుంటున్నారు. వర్మ - పూరీ అయినా ఇంకా సినిమాలు తీస్తూ తామేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కష్ణవంశీకి మాత్రం సినిమాలు కూడా లేవు. ఒక్క నిర్మాత కూడా కృష్ణవంశీతో మూవీ తీసేందుకు ముందుకు రావడం లేదు.
       
టైమ్ కుదరక ఇన్నాళ్లూ పట్టించుకోలేదు కానీ కృష్ణవంశీకి చాలా డ్రీమ్ ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి రుద్రాక్ష. ఈ సినిమాను స్టార్ట్ చేసి మళ్లీ తానేంటో నిరూపించుకోవాలని ఆశ పడుతున్నాడు వంశీ. అయితే.. ఇప్పుడున్న టైమ్ లో వంశీ తీసిన నక్షత్రం సినిమానే జనాలకు నచ్చలేదు. అలాంటికి రుద్రాక్షలు - కమండలాలు తీస్తే ఎవరు చూస్తారు. అదీగాక.. వంశీ తన స్టైల్ ని కూడా కచ్చితంగా మార్చుకోవాలి. తెర నిండా జనం - వాళ్ల అరుపులు తగ్గించి… కథపై దృష్టి పెడితే హిట్ కొడతాడు. కానీ బేసిగ్గా వంశీ ఎవ్వి మాట వినే రకం కాదు. ఎవ్వరేమనుకున్నా కానీ ఆయనకు నచ్చిందే తీస్తాడు. మరి.. కనీసం రుద్రాక్షతో అయినా హిట్ రావాలని కోరుకుందాం.