Begin typing your search above and press return to search.

రుద్రాక్ష లేదంటున్న దర్శకుడు

By:  Tupaki Desk   |   25 Jun 2019 5:22 AM GMT
రుద్రాక్ష లేదంటున్న దర్శకుడు
X
కృష్ణవంశీ అంటే ఒకప్పుడు స్టార్ బ్రాండ్. నిన్నే పెళ్లాడతా లాంటి సాఫ్ట్ ఫ్యామిలీ లవ్ స్టోరీతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినా సిందూరం లాంటి సెన్సిటివ్ నక్సల్స్ కాన్సెప్ట్ తో మెప్పించి అవార్డులు సాధించినా ఆయనకే చెల్లింది. రవితేజ-కాజల్ అగార్వల్-టబు లాంటి ఎందరికో కీలకమయిన బ్రేక్ ఇచ్చిన కృష్ణవంశీ గత కొంత కాలంగా తన స్థాయి సక్సెస్ అందుకోలేక రేస్ లో వెనుకబడ్డారు. లాస్ట్ మూవీ నక్షత్రం మరీ దారుణంగా డిజాస్టర్ కావడంతో కాస్త పెద్ద గ్యాప్ తీసుకోకతప్పలేదు. అంతకు ముందు రామ్ చరణ్ ఇచ్చిన గోవిందుడు అందరివాడేలే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేక పోయారు.

అందుకే ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న కృష్ణవంశీ రుద్రాక్ష అనే భారీ మూవీ తీయబోతున్నారని బండ్ల గణేష్ నిర్మాతగా త్వరలో పట్టాలు ఎక్కుతుందని నిన్నంతా ప్రచారం జరిగింది. దీనికి కృష్ణవంశీ స్పందించారు. అసలు తానుగా చెప్పే దాకా ఏ వార్తని పుకారుని నమ్మకండని చెబుతూ ఏదైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తామని చెప్పారు. సో రుద్రాక్ష న్యూస్ ఫేక్ అని తేలినట్టే. అయితే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు.

అప్పుడెప్పుడో పదేళ్ల క్రితమే చిరంజీవి హీరోగా వందేమాతరం అనే చారిత్రాత్మక చిత్రం వంద కోట్ల బడ్జెట్ తో కృష్ణవంశీ ప్లాన్ చేసారని గాసిప్స్ వచ్చాయి. ఆయన కథ రాసుకున్న మాట నిజమే కానీ అది కార్యరూపం దాల్చే దిశగా ఏనాడూ అడుగులు పడలేదు. ఇప్పుడీ రుద్రాక్ష వంతు వచ్చింది. ఏదేమైనా మేకింగ్ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న కృష్ణవంశీ మళ్ళి కంబ్యాక్ అవ్వాలని కోరుకోని సినిమా ప్రేమికులు ఎవరుంటారు.