Begin typing your search above and press return to search.

దేవుడు.. దేశం.. కుటుంబం @కృష్ణవంశీ

By:  Tupaki Desk   |   28 July 2015 6:57 AM GMT
దేవుడు.. దేశం.. కుటుంబం @కృష్ణవంశీ
X
కొంతమంది దర్శకులు మన ఇండస్ట్రీ లోకి రాకపోయి వుంటే వాళ్ళకన్నా మనం ఎక్కువ దురదృష్టవంతులం అని అనిపిస్తుంది. అలాంటి వారిలో తెలుగు సినిమాని కొత్త కోణంలో చూపించిన పసుపులేటి కృష్ణవంశీ ఒకరు. వర్మ స్కూల్ తో సంబంధం వున్న ఈ దర్శకుడి జన్మదినం నేడు.

థ్రిల్లర్ ని, కామెడీని మిక్సీ లో వేసి తెరకెక్కించిన వంశీ మొదటి సినిమా 'గులాబీ' సూపర్ హిట్.. ఆ సినిమాలో 'ఈ వేళలో నీవు..' పాట ఆల్ టైం ఫేవరేట్ గా నిలిచింది. నాగార్జునతో తీసిన 'నిన్నే పెళ్ళడతా' ఏ రేంజ్ హిట్టంటే ఇప్పటికీ టి.వి లలో ఆ సినిమాని ఎన్ని వందల సార్లు చూసినా మరోసారి రెడీ అయిపోతాం. సింధూరం తో రవితేజ నటనని తెరపైకి చూపించగలిగారు. ఫ్యాక్షన్ నేపధ్యాన్ని ఇలా కూడా తెరకెక్కించగలమా అన్నట్టు అంతఃపురాన్ని తెరకెక్కించారు. మహేష్ కి 'మురారి', శ్రీకాంత్ కి 'ఖడ్గం' కాజల్ కి 'చందమామ' ప్రభాస్ కి 'చక్రం' వంటి సినిమాలను తమ కెరీర్ కే మరిచిపోలేని మధుర జ్ఞాపకాలుగా నిలిచాయి.

ఆ కాలంలో హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన రమ్యకృష్ణని వివాహం చేసుకున్నారు. వంశీ సినిమాలలో పాటలకి, వాటి చిత్రీకరణకి ప్రత్యేక స్థానం వుంటుంది. అందుకే 75 సంవత్సరాల సినిమా వేడుకలో 'వి ఆర్ వన్' పాట చిత్రీకరణను ఆయన చేతిలో పెట్టారు. ఇటీవల వచ్చిన శ్రీ ఆంజినేయం, శశిరేఖా పరిణయం, మొగుడు, పైసా వంటి భారీ ఫ్లాప్ లతో కాస్త డల్ ఫేజ్ లో ఈయన బండి నడుస్తుంది. అయితే ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా పాత వంశీని కొంతమేరకు చూపించగలిగింది. ఒక్కమాటలో సినీవినీలాకాశంలో వెలుగుతున్న చందమామ కృష్ణవంశీ.. హెచ్చుతగ్గులు జాబిలికి సర్వసాధారణం. మరుసటి జన్మదినం నాడు వంశీ పూర్వవైభవంతో కళకళలాడిపోవాలని ఆశిస్తూ తుపాకీ.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.