Begin typing your search above and press return to search.

చల్ మోహన రంగ..మళ్లీ పెన్ పవర్ చూపిస్తాడా?

By:  Tupaki Desk   |   20 March 2018 11:17 AM GMT
చల్ మోహన రంగ..మళ్లీ పెన్ పవర్ చూపిస్తాడా?
X
కథలు.. మాటలు.. స్క్రీన్ ప్లేలు రాసేవాళ్లు దర్శకులుగా మారడం మామూలే. ఐతే గీత రయయితలు దర్శకులుగా మారడం మాత్రం అరుదు. ఈ అరుదైన జాబితాలోనే చేరాడు కృష్ణ చైతన్య. ఎన్నో హిట్ సినిమాలకు పాటలు రాసి మెప్పించిన కృష్ణచైతన్య నాలుగేళ్ల కిందట నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘రౌడీఫెలో’తో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే అతను తనదైన ముద్ర వేశాడు. ఆ చిత్రంలో అందరినీ అమితంగా ఆకర్షించిన అంశం డైలాగులే. సినిమా అంతటా చాలా డెప్త్ ఉన్న మాటలతో ఆకట్టుకున్నాడు చైతన్య. ముఖ్యంగా రోహిత్-రావు రమేష్ కాంబినేషన్లో వచ్చే ప్రతి సన్నివేశంలోనూ మాటలు భలేగా పేలాయి.

ఇండస్ట్రీ జనాలంతా అప్పట్లో ‘రౌడీఫెలో’ డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నారు. డైలాగులు రాయడంలో ఉద్ధండుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ సినిమాలో మాటలకు ఫిదా అయ్యాడు. ఆ విషయాన్ని ఓ సందర్భంలో త్రివిక్రమే చెప్పాడు కూడా. కృష్ణచైతన్య పని తనానికి మెచ్చి పవన్ తో కలిసి అతడి రెండో సినిమాను నిర్మించడానికి కూడా త్రివిక్రమ్ ముందుకొచ్చాడు. ఆ సినిమానే ‘చల్ మోహన రంగ’. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమాతో పెన్ పవన్ చూపించిన కృష్ణ చైతన్య.. రెండో సినిమాలోనూ మాటతో మ్యాజిక్ చేస్తాడేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి ప్రయత్నంలో సీరియస్ సినిమా తీసి అందుకు తగ్గ డైలాగులు రాసిన కృష్ణచైతన్య.. ఈసారి ఎంటర్టైనర్ ట్రై చేశాడు. మరి ఇందులో ఎలాంటి డైలాగ్స్ రాశాడో చూడాలి.